షాకింగ్ న్యూస్: గుండెపోటుతో మోడల్ రణబీర్ కపూర్ హఠాన్మరణం!

Update: 2020-07-18 03:15 GMT
సినీ హీరోలకు డూప్ హీరోలు ఉండటం మాములే. కొందరు సినిమాల్లో కనిపిస్తారు. మరికొందరు వెలుగులోకి రారు. ఎవరో ఒకరు వారిని గుర్తించి ఈ ప్రపంచానికి పరిచయం చేస్తేగాని తెలియదు. అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ ప్రముఖ హీరోకి అచ్చు గుద్దినట్లుగా ఓ మోడల్ సోషల్ మీడియాలో పాపులర్ అయ్యాడు. కానీ అతని జీవితం మోడల్ గానే ముగుస్తుందని ఎవరు ఊహించగలరు. అవును.. అలా ప్రపంచం అతడిని హీరోలా ఉన్నావని గుర్తించేలోపే అతను ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. ఆ ప్రముఖ హీరో ఎవరో కాదు. స్టార్ హీరో రణబీర్ కపూర్. ఆ జిరాక్స్ అంటే అచుగుద్దినట్లు ఉన్న మోడల్ జునైద్ షా. కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన జునైద్ చూడటానికి అచ్చం రణబీర్ లాగే ఉంటాడు. కానీ దురదృష్టం ఏంటంటే.. మృత్యువు అతడిని హార్ట్ ఎటాక్ రూపంలో ఇటీవలే కబళించింది.

ఈ విషయాన్నీ కాశ్మీర్ జర్నలిస్ట్ యూసుఫ్ జమీల్ తాజాగా వెల్లడించాడు. యూసుఫ్ మాట్లాడుతూ.. "జునైద్ షా.. శుక్రవారం కాశ్మీర్ లోని తన నివాసంలో గుండెపోటుతో మృతిచెందాడు. నిస్సార్ అహ్మద్ షా కొడుకైన జునైద్ హీరో రణబీర్ లా ఉంటాడని అంతా పిలిచేవారు. కానీ తల్లిదండ్రులకు అండగా నిలుస్తాడని అనుకున్నాను. 28 ఏళ్ల జునైద్‌ను గ‌త నెలలోనే ముంబైకు వెళ్లమని చెప్పాను. ముంబైలోనే మోడ‌లింగ్ చేసుకుంటూ అనుప‌మ్‌ఖేర్ యాక్టింగ్ స్కూల్‌లో న‌ట‌న‌పై శిక్ష‌ణ తీసుకోవ‌చ్చ‌ని చెప్పాను. కానీ ఇంత‌లోనే జునైద్ చనిపోయాడు. కానీ ఇంత‌కుముందెన్న‌డూ అతనికి హార్ట్ కి సంభందించిన వ్యాధులు లేవని యూసుఫ్ పేర్కొన్నాడు. అయితే కొన్నేళ్ల కిందటే జునైద్ ర‌ణ్‌బీర్ క‌పూర్‌లా ఉన్నాడని.. ఆ ఫోటోలు కూడా తెగ వైరల్ అయ్యాయి. అప్పట్లో జునైద్ ఫోటోలు చూసి ఓ సందర్భంలో ర‌ణ్‌బీర్ తండ్రి రిషిక‌పూర్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రస్తుతం జునైద్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Tags:    

Similar News