కుర్రాళ్లతో బాబు పోటీ పండుతుందా?

Update: 2018-01-30 13:52 GMT
ఇప్పుడున్న ట్రెండ్ లో ఏ సినిమాకు సోలో రిలీజ్ సాధ్యం కాదనే సంగతి తేలిపోతోంది. ఎలాంటి పోటీ ఉన్నా కంటెంట్ ఉంటే సినిమా సక్సెస్ సాధించడం కూడా సాధ్యమే. అయితే.. ఈ పోటీ ఇప్పటివరకూ ఆయా హీరోల రేంజ్ కు తగినట్లుగానే కనిపించేది. లేకపోతే.. రిజల్ట్ ఎలా ఉన్నా ముందు మాత్రం వాతావరణం చూస్తే.. వార్ వన్ సైడ్ అన్నట్లుగా ఉండేది.

ఈ శుక్రవారం రెండు సినిమాలు రిలీజ్ అవుతుంటే.. ఫిబ్రవరి 9న ఏకంగా 4 సినిమాలు థియేటర్లలోకి వచ్చేస్తున్నాయి. వచ్చేవారం రానున్న మూవీస్ లో.. మోహన్ బాబు నటించిన గాయత్రి.. సాయి ధరం తేజ్ సినిమా ఇంటెలిజెంట్.. వరుణ్ తేజ్ మూవీ తొలిప్రేమ.. నిఖిల్ నటించిన కిర్రాక్ పార్టీ ఉన్నాయి. గాయత్రి మినహాయిస్తే మిగిలిన మూడు సినిమాలు కుర్ర హీరోలవే అనే విషయం గమనించవచ్చు. అంటే యంగ్ హీరోలతో పోటీ పడబోతున్నారు సీనియర్ హీరో మోహన్ బాబు. మోహన్ బాబు సినిమాల్లో.. చాలా కాలం తర్వాత ముందు నుంచే ప్రామిసింగ్ కనిపిస్తున్న చిత్రం గాయత్రి.

లుక్ దగ్గర నుంచి అన్ని విషయాల్లోనూ గాయత్రికి సానుకూలత ఉంది. కానీ మూవీపై బజ్ విషయానికి వస్తే ఇంటెలిజెంట్.. తొలిప్రేమ ముందుండగా.. కిర్రాక్ పార్టీ ఆసక్తి కలిగిస్తోంది. మోహన్ బాబు నుంచి సోలోగా సాలిడ్ హిట్ పడి చాలాకాలం అయిపోవడంతో.. ఆయన స్టామినా ఏంటో ఇప్పటి జనానికి పెద్దగా తెలియకపోవచ్చు. అందుకే ఇప్పుడు అంతగా గాయత్రికి క్రేజ్ కనిపించకపోవచ్చు కానీ.. మూవీ అదిరిందంటే మాత్రం ఫుల్ స్పీడ్ లో కుర్రాళ్లను దాటేస్తారు మోహన్ బాబు.
Tags:    

Similar News