దాసరి నారాయణరావు మృతితో ఆయన దత్త పుత్రుడు మంచు మోహన్ బాబు విలవిలలాడిపోయారు. ఎప్పుడూ గంభీరంగా కనిపించే మోహన్ బాబు.. తన గురువు మరణంతో నీరుగారిపోయారు. ఎన్నడూ చూడని విధంగా ఆయన బోరున ఏడ్చేశారు. దాసరి అస్వస్థతకు గురవగానే కిమ్స్ ఆసుపత్రికి వచ్చేసిన మోహన్ బాబు.. గురువుకు ఏమవుతుందో అని తీవ్రంగా కలత చెందారు.
సరికి చికిత్స జరుగుతున్న చోటే గది బయటే ఉంటూ ఎప్పటికప్పుడు వైద్యుల్ని పరిస్థితి అడిగి తెలుసుకుంటూ తీవ్ర ఆందోళనలో కనిపించారు. చివరికి మంగళవారం సాయంత్రం దాసరి ఇక లేరన్న వార్త తెలియగానే మోహన్ బాబు తట్టుకోలేకపోయారు. బోరున ఏడ్చేశారు. చాలా సేపు అలా ఏడుస్తూనే ఉండిపోయాడు మోహన్ బాబు. చివరికి మీడియా ముందుకు వచ్చినపుడు కూడా.. మాట్లాడుతున్నపుడు కూడా మోహన్ బాబు ఏడుస్తూనే కనిపించారు. దాసరి అంటే ఒక చరిత్ర అని.. ఇప్పుడు ఒక శకం ముగిసిందని మోహన్ బాబు అన్నారు. దాసరి మరణ వార్తను తాను జీర్ణించుకోలేకపోతున్నానని చెప్పారు. తనకు ఆయన తండ్రితో సమానమని.. తనకు నటుడిగా గుర్తింపు తీసుకుని వచ్చింది దాసరే అని అన్నారు. మీడియాతో మాట్లాడుతూ మాట్లాడుతూ మోహన్ బాబు మధ్యలో ఆగిపోయి.. పొగిలి పొగిలి ఏడ్చారు. బట్టతో ముఖం తుడుచుకుని.. ఇక తాను కొనసాగించలేనంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు మోహన్ బాబు.
దాసరి చిన్న కొడుకు అరుణ్ కుమార్ ఉబికి వస్తున్న దు:ఖాన్ని ఆపుకోగలిగాడు కానీ.. మోహన్ బాబు మాత్రం ఏడుపు ఆపలేకపోయాడు. మోహన్ బాబు దాసరికి అత్యంత ప్రియమైన శిష్యుడన్న సంగతి తెలిసిందే. వీళ్లిద్దరి బంధం గురించి ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. రెండు నెలల కిందట దాసరి తీవ్ర అస్వస్థతకు గురైనపుడు మోహన్ బాబు కొన్ని రోజుల పాటు కిమ్స్ ఆసుపత్రిలోనే ఉండి గురువును జాగ్రత్తగా చూసుకున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/