నాగచైతన్య- సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న లవ్ స్టోరి నుంచి `సారంగ దరియా..` సాంగ్ ఇటీవల రిలీజై యూట్యూబ్ సహా డిజిటల్ మాధ్యమాల్లో సెన్సేషన్ సృష్టించిన సంగతి తెలిసిందే. సాయిపల్లవి అద్భుతమైన డ్యాన్సులు.. సుద్దాల అశోక్ తేజ లిరిక్.. మంగ్లీ ఎనర్జిటిక్ గానం.. ఈ పాటను చార్ట్ బస్టర్ గా నిలిపాయి.
అయితే ఈ పాటను కాపీ చేశారని.. ట్యూన్ లిరిక్ తన సొంతమని జానపదగాయని కోమాలి ఆరోపించడం.. యూట్యూబ్ ఇంటర్వ్యూలు ఇవ్వడం సంచలనమైంది. రేలా రే బుల్లితెర ప్రోగ్రామ్ లో ఆ పాటను పాడానని తెలిపిన సదరు గాయనీమణి.. సినిమాలోనూ పాడేందుకు అవకాశం ఇస్తే మంగ్లీ కంటే బాగా పాడేదానినని కోమాలి అన్నారు. ఆ పాటను ఏ వేదికపై అయినా పాడే హక్కు తనకి ఉందని అన్నారు.
ఇప్పుడు అదే మోసాన్ని టాలీవుడ్ సినీపెద్ద మంచు మోహన్ బాబు ఉన్న వేదికపైనే మరోమారు సదరు సింగర్ బహిర్గతం చేశారు. మంచు విష్ణు నటించిన `మోసగాళ్లు` ప్రీ-రిలీజ్ వేదిక ఇందుకు సాక్షీభూతంగా నిలిచింది. ఈ వేడుకలో కోమాలిని వేదికపైకి పిలవడమే గాక.. తనకు తదుపరి చిత్రంలో పాడేందుకు అవకాశమిస్తున్నామని మోహన్ బాబు అన్నారు.
వేదికపై గాయని కోమాలి మాట్లాడుతూ ..``నేను ఇంతకుముందు మోసానికి గురయ్యాను. కానీ నా ప్రతిభను మోహన్ బాబు గారు గుర్తించినందుకు సంతోషంగా ఉన్నాను`` అని అన్నారు. ఈ వేదికకు పిలిచినందుకు డైమండ్ రత్నంకు.. పాట వాగ్ధానం చేసిన మోహన్ బాబుకు కోమాలి కృతజ్ఞతలు తెలిపారు. లవ్‌స్టోరీ బృందం తనకు క్రెడిట్ లు ఇవ్వకుండా సారంగ దరియా పాటను దొంగిలించారన్నది కోమాలి ఆరోపణ. కానీ అవే సారంగ దరియా పదాలతో అంతకుముందే జానపద గీతం ఉందని .. ఆ పాట స్ఫూర్తితోనే తాను లిరిక్ రాసానని సుద్దాల వెల్లడించారు.