హీరోయిన్ తో మోహన్ బాబుకి ఇబ్బంది

Update: 2017-01-30 04:36 GMT
విలక్షణ నటుడు మోహన్ బాబు సాధారణంగా హీరోయిన్స్ గురించి కామెంట్స్ చేయడం.. కామెడీలు చేయడం లాంటివి అంతగా కనిపించవు. ఒకనాటి హీరోయిన్స్ సంగతి పక్కన పెడితే.. ఈ తరం హీరోయిన్స్ తో ఎవరైనా తప్పుగా బిహేవ్ చేసినా.. చేసినట్లుగా ఆయనకు అనిపించినా గట్టి క్లాసులు స్టేజ్ పైనే పీకేసేందుకు వెనకాడని సందర్భాలు కనిపిస్తాయి.

తాజాగా మంచు మనోజ్ మూవీ గుంటూరోడు ఆడియో ఫంక్షన్ కు హాజరయ్యారు మోహన్ బాబు. సినిమా గురించి యూనిట్ గురించి చెబుతూండగా.. మధ్యలో హీరోయిన్ సురభి ప్రస్తావన కూడా వచ్చింది. 'హీరోయిన్ ని తెచ్చి నా పక్కన కూర్చోబెట్టాడు మనోజ్. అలా హీరోయిన్ నా పక్కన కూర్చుంటే కంగారు పడ్డాను. నా హీరోయిన్ అయితే భుజంపై చెయ్యేసుకోవచ్చు.. లేదంటే షోల్డర్ పై చెయ్యి ఆనించుకోవచ్చు. కానీ ఆ అమ్మాయి వచ్చి కూర్చునే సరికి అనీజీగా అనిపించింది. తగిల్తే వాడేమన్నా అనుకుంటాడేమో అనిపించింది'  అన్నారు మోహన్ బాబు.

'అప్పుడు మనోజ్ కి చెప్పాను.. ఆ అమ్మాయికి కూడా చెప్పాను.. నువ్వు అటు వెళ్లి కూర్చో అన్నాను.. అందుకే టచ్ చేయను.. ఆ పక్కన విష్ణు ఉన్నాడు.. ఈ పక్కన మనోజ్ ఉన్నాడు. మరోవైపు నా వైఫ్ చూస్తోంది. ఇవన్నీ నావల్ల కాదని చెప్పి ఓ పక్కన కూర్చోపెట్టాను. థాంక్యూ ఫర్ హీరోయిన్' అంటూ హీరోయిన్ సురభితో తనకు ఆ వేడుకలో ఎదురైన ఇబ్బందిని గురించి వివరించారు మోహన్ బాబు. రీసెంట్ గా లక్కున్నోడు ప్రెస్ మీట్ లో కూడా హన్సిక చెయ్యి పట్టుకుని ఇలాగే మోహన్ బాబు జోకులు వేయడం హాట్ టాపిక్ అయింది. 

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News