మంచు మోహన్ బాబు చాలా ఏళ్ల తర్వాత పూర్తి స్థాయి హీరోగా నటించిన సినిమా ‘గాయత్రి’. నిన్నే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. సినిమాకు ఏమంత గొప్ప టాక్ లేదు కానీ.. మోహన్ బాబు అభినయం మాత్రం ప్రశంసలందుకుంటోంది. ఈ చిత్రంలో రెండు రకాల పాత్రలతో మెప్పించాడు మోహన్ బాబు. ముఖ్యంగా గాయత్రి పటేల్ పాత్ర సినిమాకు ఆకర్షణగా నిలిచింది. శివాజీ పాత్ర జస్ట్ ఓకే అనిపించింది. ఐతే ఈ పాత్రలో మోహన్ బాబు పేల్చిన పొలిటికల్ డైలాగులు మాత్రం చర్చనీయాంశం అయ్యాయి. ‘గాయత్రి’లో పొలిటికల్ డైలాగులు ఉంటాయన్న సంకేతాలు ముందే ఇచ్చాడు మోహన్ బాబు. ఐతే ఆయన ఎవరిని టార్గెట్ చేసి ఉంటారా అని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. ఆయన టార్గెట్.. ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న చంద్రబాబు సర్కారే అని స్పష్టమైపోయింది.
ఒక సీన్లో మోహన్ బాబు.. ‘‘ఒకడేమో బీకాంలో ఫిజిక్స్ చదివానంటాడు.. ఇంకొకడేమో నా పింఛను తీసుకుంటున్నావ్.. నా రోడ్ల మీద నడుస్తున్నావ్.. నాకే ఓటేయాలంటాడు. ఇంకొకడేమో సార్వభౌమాధికారం అని పలకలేక బౌబౌ అంటాడు’’ అంటూ డైలాగ్ పేల్చాడు. ఈ డైలాగులు ఎవరిని ఉద్దేశించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మరోవైపు ఆంధ్రాలో ఇసుక మాఫియా.. భూ కబ్జాల గురించి కూడా మరో సీన్లో సెటైర్లు వేశాడు మోహన్ బాబు. మంత్రుల గురించి కూడా ఒక సీన్లో డైలాగ్ పేల్చాడు. మొత్తంగా ఆయన కొంచెం గట్టిగానే బాబు సర్కారును తగులుకున్నాడు. దీన్ని బట్టి చూస్తే వచ్చే ఎన్నికల్లో మోహన్ బాబు ఒకవేళ రాజకీయాల్లోకి పునరామనం చేస్తే ఎటు వైపు ఉంటాడన్నది స్పష్టమైపోయినట్లే.