హీరోగా ప్రయోగాలు చేయడానికి ఆ వైపు వెళ్లిన సునీల్, అది అంత సేఫ్టీ జోన్ కాదనే విషయాన్ని గ్రహించడానికి కొంత సమయం పట్టింది. దాంతో ఆయన మళ్లీ కమెడియన్ గా చేయడానికి వెనక్కి వచ్చాడుగానీ, ఆశించిన స్థాయిలో పాత్రలు పడలేదు. దాంతో విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ, సునీల్ లో ఒక కొత్త నటుడు ఉన్నాడనే విషయాన్ని ప్రూవ్ చేశాడు. ఏది జరిగినా మనమంచికే అన్నట్టుగా, సునీల్ ఇప్పుడు విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలలో దూసుకుపోతున్నాడు. అలా తాజాగా 'సన్ ఆఫ్ ఇండియా సినిమాలోను ఒక ముఖ్యమైన పాత్రను పోషించాడు.
ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సునీల్ మాట్లాడాడు. మోహన్ బాబుగారు చాలా గొప్ప ఆర్టిస్ట్ అనీ .. అలాంటి ఆయన సినిమాల సంఖ్యను తగ్గించుకోవడం కరెక్ట్ కాదని అన్నాడు. ఇకపై ఆయన వరుస సినిమాలు చేయాలని కోరుకుంటున్నానని చెప్పాడు. ఇంట్లో కంటే కూడా సెట్లోనే ఆయన ఎక్కువగా కనిపించాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. డేర్ తో మోహన్ బాబు రిస్క్ తీసుకోవడమే ఆయన సక్సెస్ కి కారణమని చెప్పాడు. అదే సమయంలో స్టేజ్ ముందు వరుసలో కూర్చున్న మోహన్ బాబు మరో మైక్ తీసుకుని, సునీల్ ను కాస్త తికమకపెట్టే పని చేశారు.
రీసెంట్ గా 'పుష్ప' సినిమాలో చాలా అద్భుతంగా చేశావు .. ఈ స్టేజ్ పై కూడా నిజాలు మాట్లాడవు. కానీ ఆఫీసుకు వచ్చినప్పుడు నువ్వేమన్నావో చెప్పకపోతే నాకు కడుపు ఉబ్బిపోతుంది. ఆలీ .. పోసాని ఇద్దరూ మన సినిమాలో ఉన్నారయ్యా అని నేను చెబితే నువ్వు ఏమన్నావ్? వాళ్ళిద్దరి కంటే నేను చాలా బాగా చేస్తానని అన్నావు. వాళ్లిద్దరూ ఎందుకు పనికిరారు అన్నావు. అన్నావా లేదా? అంటూ సూటిగా అడిగారు. దాంతో సునీల్ కంగారు పడిపోయి .. "అయ్యబాబోయ్ నేనేమీ అనలేదండి .. " అంటూ సమాధానమిచ్చే ప్రయత్నం చేశాడు.
కానీ అప్పటికి కూడా మోహన్ బాబు వదిలిపెట్టలేదు .. "లేదయ్యా ఏదో అన్నావ్ .. నువ్వు చెప్పు కరెక్టుగా ఏమన్నావో.
అలీ కూడా ఇంతకుముందు హీరోగా చేశాడయ్యా అంటే, వాడు హీరోగా నా కంటే ఎక్కువ సినిమాలు చేయలేదు .. నాకంటే ఎక్కువ హిట్లు ఇవ్వలేదు అన్నావు. "నేను ఎప్పుడు అన్నానన్నయ్యా .. " అంటూ సునీల్ నవ్వేశాడు. నరేశ్ .. నువ్వు చెప్పు .
సునీల్ అలా అని ఉంటాడా లేదా? అని మోహన్ బాబు అడిగారు. "అయినా అయ్యుండొచ్చునయ్యా .. " అంటూ అదేదో సినిమాలో మేనరిజమ్ ను నరేశ్ గుర్తుకు చేశాడు. మొత్తానికి ఈ సంభాషణ సరదాగా నవ్వులు పూయించింది.