మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఈ వయసులో కూడా వరుస విజయాలతో కేవలం కేరళలోనే కాకుండా ఉత్తర భారతం మొత్తం తన సినిమాలతో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తున్నాడు. మలయాళంలోనే కాకుండా ఇతర భాషల్లో నటిస్తూ పాన్ ఇండియా స్టార్ గా నిలిచిన మోహన్ లాల్ కు ఒక కేసు విషయంలో టెన్షన్ తప్పడం లేదు. చాలా ఏళ్లుగా ఆ కేసు విషయమై మోహన్ లాల్ కు శిక్ష తప్పదని అంటున్నారు.
అసలు విషయం ఏంటీ అంటే మోహన్ లాల్ ఇంట్లో చాలా సంవత్సరాల క్రితం ఆదాయపు పన్నే శాక వారు సోదాలు నిర్వహించారు. అక్రమ ఆస్తులు.. మరియు లెక్కలో లోని నగదు ఏమైనా ఉన్నాయా అనే విషయాన్ని తెలుసుకునేందుకు గాను సోదాలు నిర్వహించగా ఆ సమయంలో మోహన్ లాల్ ఇంట్లో ఆదాయపు పన్ను శాఖ వారికి ఏనుగు దంతాలు లభ్యం అయ్యాయి.
ఆ విషయాన్ని గురించి ఆదాయపు పన్ను వారు పట్టించుకోలేదు. కాని అటవి శాఖ వారు మోహన్ లాల్ అక్రమంగా ఏనుగు దంతాలను ఇంట్లో ఉంచుకున్నాడు అంటూ కేసు నమోదు చేయడం జరిగింది. అటవి శాఖ అధికారులు నమోదు చేసిన కేసు పై కోర్టుకు వెళ్లిన మోహన్ లాల్ ఆ కేసును కొట్టి వేయించాడు. అటవి శాఖ వారు మరియు సామాజిక కార్యకర్తలు హైకోర్టుకు వెళ్లడంతో అక్కడ మోహన్ లాల్ కు కష్టం తప్పలేదు.
మోహన్ లాల్ తనపై ఉన్న అటవి శాఖ కేసు నిరాధారమైనది.. అలాంటి కేసును విచారించకుండా హోల్డ్ లో పెట్టాలంటూ హైకోర్టు లో విజ్ఞప్తి చేశారు. కాని ఏనుగు దంతాలు ఇంట్లో కలిగి ఉండటం అనేది పెద్ద నేరం. కనుక మీరు ఆ విషయంలో ఎంక్వౌరీకి సహకరించాల్సిందే. మీరు ఎంక్వౌరీలో మీ నిర్దోశిత్వంను నిరూపించుకోవాల్సిందే అంటూ సూపర్ స్టార్ మోహన్ లాల్ కు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
కోర్టు ఆదేశాలతో మోహన్ లాల్ కు టెన్షన్ మొదలు అయ్యింది. ఇంట్లో ప్రత్యక్షంగా ఆదాయపు పన్ను శాఖ వారు ఏనుగు దంతాలను చూశారు.. అవి గతంలో మీడియాలో వార్తలు వచ్చాయి.
కనుక మోహన్ లాల్ ను విచారిస్తే తప్పకుండా ఏనుగు దంతాలు ఉన్నట్లుగా నిర్థారణ అవుతుంది. కనుక మూడు నుండి ఏడు సంవత్సరాల వరకు మోహన్ లాల్ కు జైలు శిక్ష పడే అవకాశం ఉందంటున్నారు. మరి మోహన్ లాల్ ఆ శిక్షను తప్పించుకోలేస్తాడా లేదా అనేది చూడాలి.