‘మనమంతా’.. ‘జనతా గ్యారేజ్’ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచిన మలయాళ నటుడు మోహన్ లాల్. ఈ సినిమాల కంటే ముందు.. తర్వాత కూడా లాల్ డబ్బింగ్ సినిమాలతో మన ప్రేక్షకుల్ని పలకరించాడాయన. ఐతే ‘జనతా గ్యారేజ్’లో జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి నటించడం.. అందులో వాళ్లిద్దరి కెమిస్ట్రీ అద్భుతంగా పండటంతో మన ప్రేక్షకుల్లో ఆయనకు మరింత ఆదరణ లభించింది. ఐతే ‘జనతా గ్యారేజ్’ ప్రమోషన్లలో లాల్ ఎక్కడా కనిపించలేదు. కనీసం ఆడియో వేడుకకు కూడా రాలేదు. వీళ్లందరూ లాల్ గురించి మాట్లాడటమే కానీ.. ఆయన ఈ చిత్ర బృందంలో ఎవరి గురించీ మాట్లాడలేదు. ఐతే తన కొత్త సినిమా ‘ఒడియన్’ ప్రమోషన్ల కోసం హైదరాబాద్ వచ్చిన మోహన్ లాల్.. ‘జనతా గ్యారేజ్’ ప్రస్తావన తెచ్చాడు.
ఈ సినిమాలో నటించడం మంచి అనుభవం అని లాల్ అన్నాడు. జూనియర్ ఎన్టీఆర్ ప్రతి సన్నివేశంలోనూ నూటికి నూరు శాతం ప్రతిభ చూపించడానికి ప్రయత్నిస్తాడని.. అది గొప్ప లక్షణమని లాల్ పేర్కొన్నాడు. ఇక తాను మలయాళంలో నటించిన ‘దృశ్యం’ చిత్రాన్ని తెలుగులో వెంకటేష్ చేశాడని.. ఆ పాత్రకు పూర్తిగా న్యాయం చేశాడని లాల్ చెప్పాడు. ఇక ‘గాంఢీవం’లో అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి ఒక పాటలో నటించడం కూడా మంచి అనుభవం అన్న మోహన్ లాల్.. అలాంటి దిగ్గజాలతో పని చేయడం ద్వారా తాను ప్రేమించడం నేర్చుకున్నానని.. వారి హాస్య చతురత కూడా నేర్చుకోదగ్గ విషయమే అని చెప్పాడు. ఏఎణ్నార్ చాలా నిరాడంబరంగా.. డౌన్ టు ఎర్త్ ఉండే వ్యక్తి అని.. పని పట్ల ఆయన నిబద్ధత గొప్పదని చెప్పాడు. ఇలాంటి వాళ్లతో పని చేయడం వల్ల హృదయపూర్వకంగా పని చేయడం అంటే ఏంటో కూడా తెలిసిందన్నాడు.