మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ పూర్తిస్థాయి పాత్రలో తెలుగులో నటించేందుకు ఒప్పకున్న మొదటి సినిమా జనతాగ్యారేజ్. దీని తర్వాత సైన్ చేసినా.. మనమంతా ముందే రిలీజ్ అయిపోయింది. ఇలా రెండు తెలుగు సినిమాల్లో ఒకేసారి నటిస్తుండడంతో.. తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకోవాలని డిసైడ్ అయ్యారు మోహన్ లాల్. ఇందుకోసం స్పెషల్ కోచింగ్ కూడా తీసుకున్నారు. కానీ జనతా గ్యారేజ్ ట్రైలర్ లో ఆయన స్వరం వినిపించలేదు.
మనమంతా చిత్రానికి డబ్బింగ్ చెప్పిన ఆయన.. జనతా గ్యారేజ్ విషయంలో వెనక్కి తగ్గారు. కొరటాల వద్దన్నాడనే టాక్ వచ్చింది కానీ.. తెలుగు వెర్షన్ లో తన పాత్రకు డబ్బింగ్ విషయంలో మోహన్ లాల్ స్వయంగా ఈ నిర్ణయం తీసుకున్నారట. తన తెలుగు యాస.. పాత్ర స్వభావాన్ని- ఆ రోల్ లో ఉన్న ఇంటెన్సిటీని క్యారీ చేయలేకపోతోందని భావించారట ఈ మలయాళ స్టార్. అందుకే తెలుగు వెర్షన్ డబ్బింగ్ కి దూరంగా ఉన్నారని తెలుస్తోంది.
నెలలపాటు కష్టపడి ప్రత్యేకంగా కోచింగ్ తీసుకున్నా.. తన తెలుగు మాడ్యులేషన్ పర్ఫెక్ట్ గా లేదని మోహన్ లాల్ నిర్ణయించుకోవడమే.. ఇప్పుడు జనతా గ్యారేజ్ లో ఆయన గొంతు వినిపించకపోవడానికి కారణం. పాత్ర కోసం కష్టపడ్డమే కాదు.. అవసరమైతే త్యాగాలు కూడా చేయాలి. ఇప్పుడు మోహన్ లాల్ చేసిందదే..డి