దర్శకులకు ఒకసారి మేకప్ వేసుకోవాలని కోరిక కలిగినట్లే.. నటులకు కూడా కెరీర్లో ఏదో ఒక దశలో మెగా ఫోన్ పట్టాలని ఉంటుంది. ఐతే నటులు దర్శకులుగా మారి విజయవంతమైన దాఖలాలు తక్కువగానే కనిపిస్తాయి. అందులోనూ సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న నటులు దర్శకులుగా ప్రతిభ చాటుకున్న సందర్భాలు మరీ అరుదు. ఈ కోవలో ఆమిర్ ఖాన్ పేరు ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి. ‘తారే జమీన్ పర్’ అనే పిల్లల సినిమాను ప్రతి ఒక్కరూ ఉద్వేగానికి గురయ్యేలా అద్భుతంగా తీర్చిదిద్ది ప్రశంసలు అందుకున్నాడు ఆమిర్. ఆ తర్వాత మళ్లీ అతను దర్శకత్వం వైపు చూడలేదు. కాగా ఇప్పుడు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్.. దర్శకత్వం చేపడుతుండటం విశేషం. ఆయన కూడా ఆమిర్ బాటలోనే బాలల చిత్రంతోనే దర్శకుడిగా పరిచయం కానుండటం గమనార్హం.
మోహన్ లాల్ ‘బారోజ్’ అనే త్రీడీ సినిమాతో దర్శకుడిగా మారుతున్నాడు. ఇది చిన్న పిల్లల చుట్టూ తిరిగే ఫాంటసీ మూవీ అట. దీన్ని అంతర్జాతీయ నటీనటులు, టెక్నీషియన్లతో తీర్చిదిద్దుతున్నాడట లాల్. పాజ్ వెగా - రఫెల్ అమార్గో లాంటి ఇంటర్నేషనల్ ఆర్టిస్టులు ఇందులో కీలక పాత్రలు చేస్తున్నారు. లీడ్ రోల్స్ చేస్తున్న పిల్లలందరూ భారతీయులేనట. విశేషం ఏంటంటే.. ఈ చిత్రానికి 13 ఏళ్ల కుర్రాడు సంగీత దర్శకుడిగా పని చేస్తున్నాడు. అమెరికన్ టాలెంట్ షో ‘ది వరల్డ్స్ బెస్ట్’లో అద్భుత రీతిలో పియానో వాయించి వీక్షకుల్ని ఉర్రూతలూగించిన లిడియన్ నాదస్వరం అనే భారత సంతతి టీనేజర్ ను ‘బారోజ్’కు మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంచుకున్నాడట లాల్. ఈ టాలెంట్ షోలో లిడియనే విజేతగా నిలిచాడు. అతడిపై ఏఆర్ రెహమాన్ సహా చాలామంది ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపించారు. అయితే మ్యూజిక్ షోలో టాలెంట్ చూపించడం వేరు - ఏకంగా ఓ ఫీచర్ ఫిలింకి సంగీత దర్శకుడిగా పని చేయడం వేరు. మరి లాల్ ఏరి కోరి ఎంచుకున్న ఈ యువ సంచలనం సినిమాలో తన ప్రతిభను ఎలా చూపిస్తాడో చూడాలి.