అక్కినేని హీరోలు మరో క్రేజీ మల్టీస్టారర్ కి రెడీ అవుతున్నారా? ఒకే ప్రేమ్ లో నాగార్జున-అఖిల్ కనిపించనున్నారా? ఓ ఇన్నోవేటివ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారా? ఆ స్ర్కిప్ట్ ని మెగాస్టార్ చిరంజీవి ఫైనల్ చేసారా? అంటే అవుననే ప్రచారం జోరుగా సాగుతోంది. నాగార్జున-అఖిల్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని తమిళ దర్శకుడు మోహన్ రాజా ఓ డిఫరెంట్ ఇన్నోవేటివ్ స్టోరీ రెడీ చేసినట్లు సమాచారం.
ఇప్పటికే ఇద్దరు హీరోలకి స్టోరీ వినిపించడం ఒప్పించడం అన్ని జరిగిపోయాయట. అయితే ఈ కథని లాక్ చేయడంలో మెగాస్టార్ చిరంజీవి కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. ఈ కథ ముందుగా మెగాస్టార్ చిరంజీవి వద్ద ప్రస్తావించారుట. అప్పుడే చిరంజీవి ఇలాంటి కథకి నాగ్-అఖిల్ అయితే పర్పెక్ట్ గా సూటవుతారని చెప్పారుట.
వెంటనే చిరంజీవి నాగార్జున కు ఫోన్ చేసి విషయం చెప్పారుట. ఆ తర్వాత మోహన్ రాజా ఆ ఇద్దరు హీరోలకి కథ వినిపించడం..వాళ్లకి నచ్చడం జరిగిందిట. దీంతో ఈ ప్రాజెక్ట్ ని అన్నపూర్ణ స్టూడియోస్ నే ప్రత్యేకంగా నిర్మించడానికి ముందుకొచ్చిందిట. బడ్జెట్ పరంగా స్ర్కిప్ట్ హై రేంజ్ లోనే కనిపిస్తుందిట. ఈ నేపథ్యంలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ భాగస్వామ్యం అయినా ఆశ్చర్యపోనవసరం లేదని ఇన్ సైడ్ టాక్ వినిపిస్తుంది.
స్టోరీ లైన్ మాత్రం చాలా ఇన్నోవేటివ్ గా ఉంటుందని అంటున్నారు. చిరంజీవి..నాగార్జున అంతగా లైక్ చేయడానికి కారణం అదేనని అంటున్నారు. మరి ఇందులో వాస్తవాలు ఏంటి అన్నది! అధికారిక ప్రకటన వస్తే తప్ప క్లారిటీ రాదు. ఇప్పటికే నాగార్జున- అఖిల్ `మనం`..` సిసింద్రీ`..`అఖిల్` చిత్రాల్లో తెరను పంచుకున్న సంగతి తెలిసిందే.
కాని అది చాలా పరిమితంగానే. ఈసారి ఏకంగా మల్టీస్టారర్ గానే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మరి నాగచైతన్యని కూడా కలిపేసుకుంటే పరిపూర్ణమైన అక్కినేని మల్టీస్టారర్ అయిపోతుంది. మెగాస్టార్ ఆ రకమైన ఐడియా ఇచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. అక్కినేని ఫ్యామిలీతో- నాగార్జున తో చిరంజీవికి ఉన్న చనువు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఇద్దరు క్లోజ్ ప్రెండ్స్. ఆ చనువుతోనే మల్టీస్టారర్ కథ అక్కినేని కాంపౌండ్ కి చేరింది. మోహన్ రాజా ఇప్పటికే మెగాస్టార్ తో `గాడ్ ఫాదర్` చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఇద్దరి కాంబినేషన్ లో వస్తోన్న తొలి చిత్రమిది.