గాడ్ ఫాదర్ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో దర్శకుడు మోహన్ రాజా టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ గా మారబోతున్నాడు. తమిళ్ లో ఈయన ఇప్పటికే ఫేమస్ దర్శకుడు. కానీ గాడ్ ఫాదర్ చేసే సమయంలో ఆయన్ను కొత్తవాడిగానే చూడటం జరిగింది. చిరంజీవిని అద్భుతంగా చూపించడంలో సక్సెస్ అయిన దర్శకుడు మోహన్ రాజా తెలుగు లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం గాడ్ ఫాదర్ సినిమా యొక్క స్క్రీన్ ప్లే తో పాటు అన్ని విధాలుగా మోహన్ రాజా వర్క్ నచ్చడంతో నాగార్జున ఆసక్తికర నిర్ణయాన్ని తీసుకున్నాడట. గత కొన్ని సంవత్సరాలుగా నాగార్జున మరియు మోహన్ రాజా సినిమా సస్పెన్స్ లో ఉంది. చాలా కాలంగా ఈ సినిమా గురించి మీడియా లో చర్చ జరుగుతోంది. కానీ నాగ్ కి నమ్మకం కుదరక ముందుకు సాగలేదు.
గాడ్ ఫాదర్ సినిమా తో మోహన్ రాజా తనను తాను నిరూపించుకున్నాడు. దాంతో నాగార్జున అనుమానం లేకుండా స్క్రిప్ట్ కు ఓకే చెప్పాడట.
ఈ ఏడాది చివర్లోనే మోహన్ రాజా తో సినిమాను చేసేందుకు నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం మాత్రమే కాకుండా ఈ సినిమాను తన యొక్క హోం బ్యానర్ లోనే నిర్మించాలని కూడా నిర్ణయించాడట.
ప్రస్తుతం గాడ్ ఫాదర్ సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా బిజీగా ఉన్న మోహన్ రాజా వచ్చే నెల నుండి నాగ్ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలు పెట్టబోతున్నారట. ఈ సినిమా నాగార్జునకు వందవ సినిమా అవ్వబోతుంది అంటూ కూడా వార్తలు వస్తున్నాయి.
మోహన్ రాజా ఈ సినిమాలో కీలక పాత్ర కోసం అఖిల్ ను నటింపజేయాలని భావిస్తున్నాడట. అందుకు నాగ్ కూడా ఓకే చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.