కేసీఆర్ జీవో స‌హేతుకంగా లేద‌న్న నిర్మాత‌!

Update: 2020-11-28 17:50 GMT
క్రైసిస్ వ‌ల్ల తీవ్రంగా న‌ష్ట‌పోయిన టాలీవుడ్ కి సీఎం కేసీఆర్ వ‌రాలు కురిపించారంటూ ప‌లువురు ప్ర‌శంస‌లు కురిపించిన సంగ‌తి తెలిసిందే. తెలంగాణ‌లో థియేట‌ర్లు తెరిచేందుకు జీవో ఇవ్వ‌డంతో పాటు.. 10 కోట్ల లోపు బ‌డ్జెట్ సినిమాల‌కు జీఎస్టీ రీఇంబ‌ర్స్ మెంట్ ఆఫ‌ర్ స‌హా ఎక్స్ ట్రా షోలు వేసుకోవ‌డానికి వెసులుబాటు క‌ల్పిస్తున్నామ‌ని సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించారు.

అయితే కేసీఆర్ జీవో స‌హేతుకంగా లేద‌ని ప్ర‌ముఖ నిర్మాత మోహ‌న్ వ‌డ్ల‌ప‌ట్ల అభిప్రాయం వ్య‌క్తం చేశారు. థియేటర్లు ఎప్పుడు ఓపెన్ చేసుకోవాలనే నిర్ణయాన్ని థియేటర్ల యాజమాన్యాలు లేదా లీజు తీసుకున్న నిర్వాహకులకు వదిలేయడం సరికాదని ఆయ‌న అన్నారు. దీనికి బదులు కరోనా ప్రభావం క్రమంలో థియేటర్లు ఓపెన్ చేయాలా? వ‌ద్దా.. లేకపోతే ఎప్పుడు ఓపెన్ చేసుకోవచ్చు? అనే దానిపై సూచనలు చేసి ఉంటే బాగుండేదనని అన్నారు.

10కోట్ల ప‌రిమితి చాలా ఎక్కువ అని రూ.3కోట్ల లోపు వాటినే చిన్న సినిమాగా ప‌రిగ‌ణించి మేలు చేస్తే బావుండేద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. థియేట‌ర్ల‌పై డిజిటల్ ప్రొవైడర్ల గుత్తాధిపత్యం లేకుండా చేయాల‌ని డిమాండ్ చేశారు. ప్ర‌భుత్వ జీవో న్యాయ‌మైన‌దిగా లేద‌ని .. కొంద‌రు పెద్ద‌వాళ్ల ప్ర‌భావానికి కేసీఆర్ లోన‌య్యార‌ని విమ‌ర్శించారు.

ఇక సినిమాల బ‌డ్జెట్ ఎక్కువ పెంచేశారు. కానీ అలా కాకుండా మంచి కంటెంట్ ఉన్న సినిమాలు తీయాలని సూచించారు ఆయ‌న‌. లో బ‌డ్జెట్ హై బ‌డ్జెట్ అనే వేరియేష‌న్ ఉంటుంది. కంటెంట్ బేస్డ్ సినిమాలే చేయాలని అన్నారు.

కంటెంట్ పై ఫోక‌స్ వ‌దిలేసి ఫ‌లానా హీరోయిన్ కావాల‌ని స్టార్ హీరోలు అడుగుతున్నాడు. హీరో ఉన్నాడు బిజినెస్ అయిపోతుంద‌ని నిర్మాత‌లు సినిమాలు తీస్తున్నారు. స్టార్ డైరెక్ట‌ర్లే ఫ‌లానా వాళ్లు కావాల‌ని అడుగుతారు. దీనికంటే స్క్రిప్టు పైనే ఫోక‌స్ చేసి కంటెంట్ ఉన్న‌వి తీయాలి. చిన్న సినిమా పెద్ద సినిమా అనే విభేధం వ‌ద్దు. లో బ‌డ్జెట్లో మంచి కంటెంట్ తో సినిమాలు తీసి ఇండ‌స్ట్రీని బాగు చేయాలి అని ఆకాంక్షించారు.
Tags:    

Similar News