మోహన్ బాబుపై పెద్ద బాధ్యత

Update: 2017-06-01 13:21 GMT
మోహన్ బాబు దాసరి నారాయణరావుకు కేవలం శిష్యుడు మాత్రమే కాదు. ఆయనకు దత్త పుత్రుడు కూడా. మోహన్ బాబును దాసరి సొంత కొడుకు కన్నా ఎక్కువ చూసుకున్నారంటే అతిశయోక్తి లేదు. మోహన్ బాబు కూడా దాసరిని తండ్రి లాగే భావించారు. దాసరి పుట్టిన రోజు వచ్చిందంటే.. మోహన్ బాబు మకాం ఆయనింటికే మారిపోతుంది. ఆయన అనారోగ్యం పాలైనపుడు కూడా ప్రియ శిష్యుడు విలవిలలాడిపోయాడు. చాన్నాళ్లు ఆసుపత్రిలోనే ఉండి.. వైద్యులతో మాట్లాడుతూ.. గురువుకు సరైన చికిత్స అందేలా చూసుకున్నాడు. ఇటీవల దాసరి ఆరోగ్యం విషమించినపుడు.. ఆయన చనిపోయినపుడు.. అంత్య క్రియల సమయంలో మోహన్ బాబే ప్రముఖంగా కనిపించాడు. ఇప్పుడు దాసరి మరణానంతరం కూడా మోహన్ బాబుపై పెద్ద బాధ్యతే పడినట్లు తెలుస్తోంది.

దాసరి కుటుంబంలో ఆస్తుల గొడవను పరిష్కరించాల్సిన బాధ్యతను మోహన్ బాబే తీసుకోవాల్సి రావచ్చని అంటున్నారు. దాసరి పెద్ద కొడుకు నుంచి విడిపోయిన అతడి భార్య సుశీల.. ఆయన మరణానంతరం మీడియా ముందుకొచ్చి ఆస్తి పంపకాలపై.. తమ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దాసరి కుటుంబ సభ్యులు మరోసారి మీడియా ముందుకు రాకుండా.. ఈ వివాదం రచ్చ కాకుండా చూడాల్సిన బాధ్యత మోహన్ బాబుదే. దాసరి లాగే ఎవరినైనా కమాండ్ చేయగల శక్తి మోహన్ బాబుకే ఉంది. దాసరి కుటుంబ సభ్యులు కూడా మోహన్ బాబును గౌరవిస్తారు. కాబట్టి ఆస్తి పంపకాల బాధ్యతను మోహన్ బాబే తీసుకోవచ్చని అంటున్నారు. అలాగే ఇండస్ట్రీలో దాసరికి రావాల్సిన ఫైనాన్స్ చెల్లింపులు.. ఇతర ఆర్థిక వ్యవహారాల్ని సెటిల్ చేయాల్సింది కూడా మోహన్ బాబే. దాసరి చనిపోవడంతో ఆయనకు ఇవ్వాల్సిన డబ్బుల్ని ఎగ్గొట్టేయొచ్చని కొంతమంది అనుకుంటున్నారు. ఎవరి నుంచి ఎంత రావాలన్న దానిపై అగ్రిమెంట్లు పక్కాగా లేకపోయినా.. ఆ వివరాలు దాసరి డైరీలో రాశారని.. ఆయన అసిస్టెంట్లకు కూడా విషయం తెలుసని.. ఉన్న సమాచారంతో అన్ని వ్యవహారాల్ని చక్కబెట్టే బాధ్యతను మోహన్ బాబు తీసుకుని.. అంతా సెటిల్ చేయబోతున్నారని సమాచారం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News