ఒకప్పుడు టాలీవుడ్ టాప్ స్టార్లకు దీటుగా భారీ విజయాలు సాధించారు సీనియర్ నటుడు మోహన్ బాబు. 90వ దశకంలో అసెంబ్లీ రౌడీ, అల్లుడు గారు, అల్లరి మొగుడు, పెదరాయుడు లాంటి పెద్ద హిట్లతో కలెక్షన్ కింగ్ అనిపించుకున్నారాయన. కానీ 2000 తర్వాత ఆయన జోరు తగ్గిపోయింది. హీరోగా వరుస పరాజయాలు ఎదుర్కోవడంతో చూస్తుండగానే మార్కెట్ అంతా కరిగిపోయింది.
ఆయన వారసత్వంతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మంచు విష్ణు, మంచు మనోజ్ సైతం హీరోలుగా అనుకున్న స్థాయిలో నిలదొక్కుకోకపోవడంతో మంచు వారి లెగసీ దెబ్బ తినేసింది. మోహన్ బాబు నెమ్మదిగా సినిమాలు తగ్గించేశారు. గత దశాబ్ద కాలంలో ఆయన నటించిన సినిమాలను వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. వాటిలో కూడా ఏదీ మెప్పించలేదు. చివరగా ఆయన లీడ్ రోల్ చేసిన గాయత్రి సినిమాకు రిలీజ్ ఖర్చులు కూడా వెనక్కి రాని పరిస్థితి.
గాయత్రి తర్వాత గ్యాప్ తీసుకుని.. సన్ ఆఫ్ ఇండియా అంటూ తాను ప్రధాన పాత్రలో మరో సినిమాను లైన్లో పెట్టారు మోహన్ బాబు. మంచు ఫ్యామిలీ సినిమాలకు చాలా కాలంగా రచనా సహకారం అందిస్తున్న డైమండ్ రత్నబాబు ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమా మొదలైనపుడు, టీజర్ లాంచ్ అయినపుడు కొంచెం బజ్ కనిపించింది.
కానీ తర్వాత ఏమైందో ఏమో.. సినిమా నుంచి ఏ అప్‌డేట్స్ లేవు. ప్రమోషన్ లేదు. అసలీ సినిమా వార్తల్లోనే లేదు. కానీ ఇప్పుడు ఉన్నట్లుండి దీనికి రిలీజ్ డేట్ ఇచ్చారు. ఫిబ్రవరి 18న సన్ ఆఫ్ ఇండియా రిలీజ్ అట. ఇలా ఏ ప్రమోషన్ లేకుండా ఉన్నట్లుండి రిలీజ్ అంటే జనాలు ఏమాత్రం పట్టించుకుంటారన్నది సందేహం. పైగా 18న రవితేజ మూవీ ఖిలాడితో ఈ చిత్రం పోటీ పడాల్సి ఉంది. దీంతో సన్ ఆఫ్ ఇండియాకు మరింత కష్టమవుతుంది. చూడాలి మరి.. మోహన్ బాబు సినిమాను జనాలు ఎంతమాత్రం ఆదరిస్తారో?