మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. కేవలం హీరోగానే కాకుండా ఆయన తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈయన మలయాళంలో ప్రియదర్శన్ దర్శకత్వంలో ఒక సినిమాను చేసేందుకు సిద్దం అవుతున్నారు. ఆ సినిమా షూటింగ్ కోసం మోహన్ లాల్ బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. 61 ఏళ్ల వయసులో బాక్సింగ్ గ్లౌజ్ లు వేసుకుని కష్టపడటం అంటే మామూలు విషయం కాదు. ఈ వయసులో సాదారణంగానే యాక్షన్ సినిమాలకు హీరోలు ఇష్టపడరు. కాని మోహన్ లాల్ మాత్రం ఏకంగా బాక్సింగ్ గ్లౌజ్ లు వేసుకుని మరీ షూటింగ్ చేసేందుకు సిద్దం అవ్వడం ఆయన డెడికేషన్ కు నిదర్శణం అనడంలో సందేహం లేదు.
సూపర్ స్టార్ మోహన్ లాల్ ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో యాక్షన్ సన్నివేశాల్లో నటించారు. కాని ఇప్పుడు చేయబోతున్న బాక్సర్ పాత్ర మాత్రం చాలా ప్రత్యేకం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. మోహన్ లాల్ వరుసగా సినిమాలు చేయడమే కాకుండా ఇలా ఛాలెంజింగ్ రోల్స్ ను కూడా చేయడం అనేది నిజంగా అభినందనీయం అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
మోహన్ లాల్ తెలుగు లో జనతా గ్యారేజ్ సినిమాలో పవర్ ఫుల్ రోల్ చేసి ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం కూడా తెలుగులో ఈయన ఒక సినిమాను చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఆ సినిమాకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. మలయాళంలో ఈయన చేస్తున్న పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దంగా ఉన్నాయి. ఇక మోహన్ లాల్ నటించి సూపర్ హిట్ అయిన దృశ్యం 2 ను తెలుగు లో రీమేక్ చేస్తున్న విషయం తెల్సిందే.