హిందీలో మొదలైన బిగ్ బాస్ షో గడిచిన సంవత్సరం ప్రాంతీయ భాషలకు విస్తరించింది. తెలుగులో ఎన్టీఆర్ , తమిళంలో కమల్ హాసన్ - మరాఠీలో మహేష్ మంజ్రేకర్ - ఇక బెంగాల్ కూడా ఈ షోను మొదలుపెట్టారు. స్టార్ టెలివిజన్ దేశవ్యాప్తంగా ప్రాంతీయ టీవీ చానెళ్లను కొని ఈ షోను అన్నిభాషల్లో షూరూ చేసింది. తాజాగా ఈ ఫీవర్ మలయాళంలోనూ విస్తరించింది. తాజాగా మలయాళంలో బిగ్ బాస్ మొదలు కాబోతోంది. వచ్చే ఆదివారం షోను ప్రారంభించబోతున్నారు.
అయితే ఈ షోను హోస్ట్ చేయడానికి ప్రఖ్యాత మలయాళ నటుడు మోహన్ లాల్ ను సంప్రదించారు. ఆయన వ్యాఖ్యానం చేయడం కోసం 12 కోట్లు డిమాండ్ చేశాడట.. స్టార్ హీరో కావడంతో ఆ మొత్తం చెల్లించడానికి సదురు చానెల్ ఓకే చెప్పి డీల్ కుదర్చుకుంది. తెలుగులో నాని తీసుకుంటున్న పారితోషికానికి ఇది మూడు రెట్లు కావడంతో అంతా నోరెళ్లబెడుతున్నారు.
బిగ్ బాస్ ప్రాంతీయ భాషల్లోనూ హిట్ కావడం.. జనాలకు ఈ షోకు బాగా అలవాటు పడడంతో సదురు చానెల్ కూడా 12 కోట్లు ఇవ్వడానికి వెనుకాడలేదు. ఇందులో 16మంది కేరళ సినీ ప్రముఖులను కూడా సెలెక్ట్ చేసి షోను ముంబైలోని బిగ్ బాస్ ఇంటిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. తెలుగులో లాగానే 100 రోజుల పాటు ఈ షో జరగనుంది. ఈ షో గ్రాండ్ గా లాంచ్ చేసేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు.