ఫస్ట్ లుక్: మోహినీ త్రిష అరుపులే

Update: 2016-10-19 04:02 GMT
చెన్నై బ్యూటీ త్రిష.. తమిళ్ లోనే కెరీర్ మొదలుపెట్టినా.. తెలుగు సినిమాలతోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. అటు తమిళ్.. ఇటు తెలుగులను బ్యాలన్స్ చేసుకుంటూ బాగానే వెలుగులు చిందించింది. కానీ ప్రస్తుతం తెలుగులో ఈ భామకు ఛాన్సులు అడుగంటిపోయిన సంగతి తెలిసిందే. గతేడాది బాలయ్యతో చేసిన లయన్ తర్వాత.. త్రిష డైరెక్ట్ తెలుగు సినిమాలో కనిపించలేదు కానీ.. తమిళ్ మాత్రం పిచ్చ ఫాస్ట్ చూపిస్తోంది. ఇంకా చెప్పాలంటే.. కెరీర్ లో ఎన్నడూ లేనంత రేంజ్ లో ఈమె చేతిలో తమిళ్ సినిమాలున్నాయి. వీటిలో హారర్ మూవీ మోహినిలో టైటిల్ రోల్ చేస్తుండగా.. ఇప్పుడా మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది.

దెయ్యం అనగానే భయంకరమైన లుక్ ఊహించుకోవడం సహజం. కానీ త్రిష మోహినిని మాత్రం భయపెట్టేంత అందంగా తయారు చేశారు. ఎనిమిది చేతులు.. ఒక్కో చేతిలో ఒక్కో ఆయుధంతో దాటి చేసేందుకు రెడీగా ఉన్నట్లు చూపులు.. ప్రతీ చెయ్యి-కాలు-మెడకు అందంగా డిజైన్ చేసిన ఆభరణాలు.. వీటన్నిటినీ మించి.. పెద్ద బంగారం కిరీటంతో త్రిష అందంగా ఉండి కూడా భయపెడుతోంది.

శరీరం అంతా నీలంగా తయాు చేసి.. బ్లూకలర్ డ్రస్  వేశారు కాబట్టి దెయ్యం అనాలి కానీ.. లేకపోతే అమ్మోరు పాత్ర అన్నా నమ్మేసేయచ్చు. దాదాపు సినిమా అంతా లండన్ లోనే చిత్రీకరించిన ఈ మూవీ.. లండన్ లో జరిగే హారర్ స్టోరీనే. ఇండియన్ మోహినిని లండన్ ఎలా పట్టుకెళతాడో.. దర్శకుడు ఆర్ మాదేష్ చెప్పాకే తెలుస్తుంది. కానీ ఇప్పటికైతే షూటింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉందంటూ ఫస్ట్ లుక్ లో ఓ క్లూ ఇచ్చాడంతే. ఏదేమైనా లుక్ మాత్రం అరుపులు అంతే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News