బిగ్ బాస్ సీజన్ 4 చివరి అంకంకు చేరింది. ఈ వారం మొత్తం కూడా గోల్డ్ మైక్ కోసం అఖిల్ మినహా అంతా కూడా పోటీ పడ్డారు. చిన్న టాస్క్ ల్లో పెద్ద గొడవలు కూడా అయ్యాయి. మొదటి టాస్క్ లో అరియానా విన్నర్ గా నిలిచింది. దాంతో ఆమెకు గోల్డ్ మైక్ లభించడంతో ప్రేక్షకులతో నేరుగా మాట్లాడుతూ ఓట్లు అడిగే అవకాశం దక్కించుకుంది. ఇక తదుపరి ఓపిక టాస్క్ లో సోహెల్ చాలా ఓపికగా ఉండి మైక్ దక్కించుకున్నాడు. సోహెల్ కూడా ప్రేక్షకులను ఓట్లు అడిగాడు. టైమ్ అంచనా టాస్క్ లో మళ్లీ అరియానా విన్నర్ గా నిలిచింది. రెండు సార్లు ప్రేక్షకులను ఓట్లు అడిగే అవకాశం దక్కించుకుంది. చివరగా డాన్స్ టాస్క్ ను బిగ్ బాస్ ఇచ్చాడు.
అఖిల్ ఇప్పటికే టాప్ 5 కి వెళ్లాడు కనుక మిగిలిన సభ్యులు డాన్సింగ్ కాంపిటీషన్ లో పాల్గొన్నారు. పాట ఆగిపోయిన సమయంలో చర్చలు జరిపి ఒక్కొక్కరు చొప్పున దిగి పోవాల్సి ఉంటుంది. కింద కూర్చోకూడదు అనే విషయం మర్చి పోయి అభిజిత్ కింద కూర్చున్నాడు. దాంతో అతడు మొదట బయటకు వచ్చేశాడు. ఆ తర్వాత అరియానా నాకు ఇప్పటికే రెండు సార్లు ఛాన్స్ వచ్చింది కనుక దిగేందుకు సిద్దం అంటూ దిగి పోయింది. ఇక సోహెల్ కూడా తాను కావాలంటే కంటిన్యూ చేయవచ్చు కాని మీ కోసం దిగుతున్నాను అంటూ దిగి పోయాడు.
మిగిలిన హారిక మరియు మోనాల్ ల్లో ఎవరు దిగాలి అన్న చర్చ వచ్చిన సమయంలో మోనాల్ మాట్లాడుతు నువ్వు బాగా ఆడుతున్నావు. ఖచ్చితంగా నీకు మంచి స్కోప్ ఉంది. అందుకే నాకు గోల్డ్ మైక్ కావాలి. ప్రేక్షకులతో మాట్లాడాలని అనుకుంటున్నాను అంటూ కోరింది. మోనాల్ టాస్క్ ల విషయాన్ని పక్కన పెడితే తనకు కెప్టెన్సీ రావడంలో హెల్ప్ చేసింది కనుక మైక్ ను త్యాగం చేస్తున్నట్లుగా హారిక చెప్పేసి దిగిపోయింది. దాంతో చివరి టాస్క్ లో మోనాల్ విజేతగా నిలిచింది. ప్రేక్షకుల సపోర్ట్ కు కృతజ్ఞతలు చెప్పిన మోనాల్ తనను ఇంతదూరం తీసుకు వచ్చారు. ఇప్పుడు కూడా సపోర్ట్ చేయండి అంటూ విజ్ఞప్తి చేసింది.