దూసుకొస్తున్న`మ‌నీ హీస్ట్`.. ముగింపు ఎలా?

Update: 2021-08-31 07:35 GMT
నెట్ ప్లిక్స్ లో `మ‌నీహీస్ట్` వెబ్ సిరీస్ సృష్టించిన సంచ‌ల‌నాల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఎలాంటి అంచ‌నాలు లేకుండా మార్కెట్ లో కి వ‌చ్చిన మ‌నీహీస్ట్ ఊహించ‌ని స‌క్సెస్ ని అందుకుంది. తొలి ఎపిసోడ్ గ్రాండ్ స‌క్సెస్ అవ్వ‌డంతో అంత‌కంత‌కు రెట్టింపు అంచ‌నాల‌తో బ్యాలెన్స్ ఎపిసోడ్లు ర‌న్ అయ్యాయి. తాజాగా `మ‌నీహీస్ట్` సీజ‌న్ చివ‌రి అంకానికి చేరుకుంది. మ‌నీహీస్ట్ ఫైన‌ల్ సీజ‌న్ ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడా స‌మ‌యం రానే వ‌చ్చేసింది.

చివ‌రి సీజ‌న్ ని మొత్తం రెండు భాగాలు రిలీజ్ చేయ‌నున్నారు. మొద‌టి భాగం సెప్టెంబ‌ర్ 3 నుంచి ప్ర‌సారం కానుంది. దీనిలో మొత్తం ఐదు ఎపిసోడ్లు ఉంటాయి. ఇక రెండ‌వ భాగం డిసెంబ‌ర్ 3న రిలీజ్ కానుంది. ఇందులోనూ 5 ఎపిసోడ్లుగా ప్ర‌సారం కానుంది. లైవ్ టెలీకాస్ట్ నేప‌థ్యంలో ప్ర‌చారం చిత్రాలు ఆక‌ట్టుకుంటున్నాయి. ట్రైల‌ర్ కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ట్రైల‌ర్ లో హై ఆక్టేన్ యాక్ష‌న్ స‌న్నివేశాలు ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. ఇది ఓ డిఫ‌రెంట్ వెబ్ సిరీస్. చిత్ర హింస‌ల‌కు గురైన ఓ ప్రోఫిస‌ర్ స్టోరీ. అటుపై మిల‌ట‌రీ యుద్దం వ‌ర‌కూ దారి తీస్తుంది. మిల‌ట‌రీకి-ముఠా గ్యాంగ్ కి మ‌ధ్య జ‌రిగే ఆస‌క్తిక‌ర పోరును ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా గ్రిప్పింగ్ స్ర్కీన్ ప్లే తో ప్ర‌జెంట్ చేసారు.

ఇప్పుడు దీనికి కొన‌సాగింపు క‌థ‌తో పార్ట్ -5 కొన‌సాగ‌నుంది. మిల‌ట‌రీ వార్ లో ముఠా గ్యాంగ్ పై చేయి సాధించ‌నుందా? లేక ఆర్మీ యాధావిధిగా ఆధిప‌త్యం చేలాయించ‌గ‌ల‌దా? అన్న ఆస‌క్తిక‌ర అంశాలు అభిమానుల్లో ఉత్కంఠ‌కు తెర లేపుతున్నాయి. మ‌రో మూడు రోజుల్లో ఆ స‌స్పెన్స్ కి తెర ప‌డ‌నుంది. ఏడాదిన్న‌ర‌గా కొవిడ్ కొన‌సాగుతుండ‌టంలో వెబ్ సిరీస్ ల‌కు మ‌రింత డిమాండ్ ఏర్ప‌డింది. ప్రేక్ష‌కులంతా ఓటీటీలోనే వినోదాన్ని పొంద‌టంతో అన్ని ర‌కాల కంటెట్ల‌కు మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోంది.




Tags:    

Similar News