బాలీవుడ్ లో ప్రయోగాత్మక చిత్రాలకు కొదవేమి లేదు. హీరోలు నటించకపోయినా క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు చేసినా ఆ మంచి కథలను ప్రేక్షకులు చూస్తుంటారు. కొందరు ప్రముఖ నటులు చేసిన చిన్న బడ్జెట్ సినిమాలు బి- టౌన్ లో సంచలనం సృష్టించాయి. ఇకపోతే ఎప్పుడో పూర్తయిన కొన్ని సినిమాలు చాలా లెట్ గా రిలీజ్ అవుతుంటాయి. అదే తరహాలో 2013 లో తెరకెక్కిన ఒక సినిమా ఈ నెల డిసెంబర్ 15న రిలీజ్ కాబోతోంది.
దాదాపు నాలుగేళ్ల తర్వాత రాబోతోన్న మాన్సూన్ షూటవుట్ సినిమాపై అంచనాలు అంత పెద్దగా ఏమి లేవు. అయితే ట్రైలర్ మాత్రం కొంచెం డిఫెరెంట్ గా ఉంది. ఓ విధంగా ఆకట్టుకుంటుందనే చెప్పాలి. 2013 కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ఒకసారి ఈ సినిమాను ప్రదర్శించారు కూడా.. అమిత్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రముఖ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ ప్రధాన పాత్ర పోషించాడు. పోలీసుల ఎటాక్స్ అండ్ గ్యాంగ్ వార్ కాన్సెప్ట్ తో తెరకెక్కించిన ఈ సినిమా ట్రైలర్ కొన్ని షాట్స్ చాలా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ట్రైలర్ చివర్లో కొంచెం పూరి జగన్నాథ్ పెన్ కథలికలు కనిపిస్తున్నాయి.
దేవుడు చేసిన మనుషులు సినిమాలో అరటి తొక్కమీద కాలు వేస్తే ఏంటి వేయకపోతే ఏంటి.. అనే కాన్సెప్ట్ ని గుర్తు చేస్తోంది. ఆ సినిమాలో రెండు యాంగిల్స్ ని చూపించినట్టు. ఈ సినిమాలో కూడా షూట్ చేయాలా? వద్దా? అనే విధంగా ఓ పాత్ర కన్ఫ్యూజన్ అవుతుంటుంది.