డ్రగ్స్ వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్‌ను షేక్ చేస్తోంది. వాళ్లకి డ్రగ్స్ తో సంబంధం ఉందట.. వీరికి డ్రగ్స్ అలవాటు ఉందంటూ వినిపించే పేర్లు గాలి మాటలు కాదని నిజాలన్న విషయం తాజాగా ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు ఇచ్చిన నోటీసులు స్పష్టం చేస్తున్నాయి. డ్రగ్స్ వాడకందారుల జాబితాలో వచ్చిన డజన్ పేర్లలో చాలా పేర్లు గతంలో వినిపించేవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే.. కొన్ని పేర్లు మాత్రం సర్ ప్రైజింగ్‌గా ఉన్నాయన్న వాదన వినిపిస్తోంది.
డ్రగ్స్ ఎపిసోడ్ లో బయటకు వచ్చిన పేర్లు కాకుండా.. బయటకు రావాల్సిన పేర్లు మరికొన్ని ఉన్నాయన్న మాట బలంగా వినిపిస్తోంది. ఆ పేర్లు కూడా బయటకు వస్తే మరింత షాక్ తప్పదని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా నాలుగు పేర్లు మిస్ అయినట్లుగా ప్రచారం సాగుతోంది. డ్రగ్స్ వ్యవహారంలో మొత్తం 16 మంది టాలీవుడ్ సెలబ్రిటీలకు నోటీసులు ఇస్తారని చెప్పుకున్నా.. చివరకు పన్నెండు మందికి మాత్రమే ఇచ్చారని తెలుస్తోంది.
మిస్ అయిన నలుగురు ఎవరన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఇప్పుడు బయటకు వచ్చిన పేర్లు కాకుండా చాలామందికి డ్రగ్స్ తో సంబంధాలు ఉన్నాయని.. అయితే.. తాజా కేసుతో మాత్రం సంబంధం లేదని చెబుతున్నారు. మొదట్లో పదహారు మంది ఉన్నారని చెప్పి.. చివరకు పన్నెండు మంది పేర్లు రావటానికి కారణం.. సరైన ఆధారాలు లేకపోవటమేనని చెబుతున్నారు. మిస్ అయినట్లుగా చెప్పుకుంటున్న నలుగురిలో ఒక పేరు మోసిన నిర్మాత కొడుకుతో సహా మరికొందరు ప్రముఖులు ఉన్నట్లుగా చెబుతున్నారు. ఏది ఏమైనా.. తాజా పరిణామాల నేపథ్యంలో.. సరైన ఆధారాలు దొరికిన వెంటనే మిగిలిన పేర్లు బయటకు రావటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.