సౌత్ ఇండియా సినిమాల బడ్జెట్ ఒకప్పుడు బాలీవుడ్ సినిమాల బడ్జెట్ లో కనీసం సగం కూడా ఉండేది కాదు. సౌత్ ఇండియన్ సినిమాలు అంటే నాసిరకం అనే ఒక అభిప్రాయం చాలా మందిలో ఉండేది. కాని ఇప్పుడు ఆ అభిప్రాయం పూర్తిగా మారిపోయింది. సౌత్ ఇండియన్ సినిమాల మార్కెట్ విపరీతంగా పెరగడంకు కారణం భారీ బడ్జెట్ తో సినిమాలు రూపొందడం అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ప్రస్తుతం తెలుగు తమిళ సినిమాలు బాలీవుడ్ ను మించాయి. కొన్ని బాలీవుడ్ సినిమాల బడ్జెట్ కు రెడ్డింతల బడ్జెట్ తో రూపొందాయి.. రూపొందుతున్నాయి. ముందు ముందు కూడా సౌత్ నుండి భారీ సినిమాలు మరిన్ని ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమిళ సినిమా వాలిమై గురించి ఆసక్తికర చర్చ ఒకటి జరుగుతోంది.
వాలిమై సినిమాలో బైక్ రైడింగ్ లు ఎక్కువగా ఉన్నాయి. వాటిని చూస్తుంటే ఒక హాలీవుడ్ సినిమా చూసిన ఫీల్ కలుగుతుంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. హాలీవుడ్ సినిమా కు ఏమాత్రం తగ్గకుండా ఆ సన్నివేశాలు ఉన్నాయని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ సమయంలో చిత్ర యూనిట్ సభ్యులు తెలియజేసిన విషయం నిజంగానే షాకింగ్ గా ఉంది.
వాలిమై సినిమా కోసం వంద కాదు రెండు వందలు కాదు ఏకంగా వెయ్యి బైకులను అది కూడా స్పోర్ట్స్ బైక్ లను వినియోగించారట. ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమాకు సైతం ఇంతటి భారీ స్థాయిలో బైక్స్ ను ఉపయోగించలేదని మేకర్స్ చెబుతున్నారు. ధూమ్ వంటి భారీ యాక్షన్ సినిమాల్లో కూడా ఈ స్థాయి లో బైక్స్ ను చూపించలేదు. కాని అజిత్ కుమార్ కోసం వెయ్యి బైక్ లను తెప్పించారట.
ఈ సినిమా బడ్జెట్ లో మెజార్టీ వాటాను బైక్ ల కోసం వినియోగించారనే వార్తలు వస్తున్నాయి. తాజాగా చిత్ర యూనిట్ సభ్యులు వెయ్యి బైక్ లను ఈ సినిమా కోసం వినియోగించాం అంటూ అధికారికంగా ప్రకటించడం అంతా కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. సౌత్ సినిమాలు ఇప్పటి వరకు బాలీవుడ్ నే మించాయి అనుకుంటూ ఉంటే వాలిమై సినిమా ఏకంగా హాలీవుడ్ సినిమాలనే మించేసిందిగా అంటూ కామెంట్స్ వస్తున్నాయి.
తమిళంతో పాటు తెలుగు లో కూడా భారీ విడుదల అయిన వాలిమై సినిమా ఇక్కడ ఆశించిన స్థాయి వసూళ్లను దక్కించుకోవడంలో విఫలం అయ్యింది. ముఖ్యంగా వాలిమై సినిమా విడుదల అయిన తర్వాత రోజే భీమ్లా నాయక్ విడుదల అయ్యింది. దాంతో వాలిమై కి జనాలు కరువయ్యారు.

హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సన్నివేశాలు ఉన్న వాలిమై సినిమాను మంచి సమయం చూసి విడుదల చేసి ఉంటే ఇక్కడ కూడా మంచి వసూళ్లు దక్కించుకునేది అంటూ ఇండస్ట్రీ వర్గాల టాక్. తమిళ నాట వాలిమై కి భారీగా వసూళ్లు నమోదు అవుతున్నాయి. వంద కోట్లకు చేరవగా వాలిమై ఉన్నట్లుగా తెలుస్తోంది.