ఇండియాలోనే నెం.1 సుశాంత్ సింగ్.. నెం.2 విజయ్ దేవరకొండ

Update: 2021-06-05 06:30 GMT
దివంగత బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కు అరుదైన గుర్తింపు దక్కింది. టైమ్స్ మ్యాగజైన్ ప్రకటించిన 'మోస్ట్ డిజైరబుల్ మెన్ 2020' జాబితాలో సుశాంత్ ఇండియాలోనే మొదటి స్థానంలో నిలిచారు. నేషనల్ వైడ్ ఆన్ లైన్ ఓటింగ్ - జ్యూరీ అభిప్రాయాల ఆధారంగా వివిధ రంగాల్లోని టాప్ 50 సెలబ్రిటీలతో టైమ్స్ గ్రూప్ 'మోస్ట్ డిజైరబుల్ మెన్ 2020' లిస్ట్ తయారు చేసింది. ఇందులో మెజారిటీ యువత సుశాంత్ కి మద్దతుగా నిలవడంతో.. బాలీవుడ్ స్టార్ హీరోలందరిని వెనక్కి నెట్టి దివంగత సుశాంత్ ఇండియన్ వైడ్ మోస్ట్ డిజైరబుల్ మెన్ గా గుర్తింపుని దక్కించుకున్నారు.

బుల్లితెర మీద గుర్తింపు తెచ్చుకున్న సుశాంత్ సింగ్ రాజ్ పుత్.. 'కై పో చెయ్' సినిమాతో బాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. 'శుద్ధ్ దేశీ రొమాన్స్' చిత్రంతో క్రేజీ హీరోగా మారిపోయిన సుశాంత్.. 'ఎంఎస్ ధోని - ది అన్ టోల్డ్ స్టోరీ' 'పీకే' 'డిటెక్టీవ్ బ్యోమకేష్ భక్షీ' 'సొంచీరియా' 'కేదార్ నాథ్' 'చిచోరె' 'డ్రైవ్' సినిమాలతో మెప్పించారు. సుశాంత్ చివరగా నటించిన 'దిల్ బేచారా' ఓటీటీ వేదికగా విడుదలై విశేష ఆదరణ దక్కించుకుంది. ఈ క్రమంలో ఇప్పుడు టైమ్స్ 'మోస్ట్ డిజైరబుల్ మ్యాన్-2020' గా నిలిచి మరోసారి వార్తల్లో నిలిచారు.

ఇకపోతే టైమ్స్ 'మోస్ట్ డిజైరబుల్ మెన్ 2020' జాబితాలో టాలీవుడ్ యువ హీరో విజయ్ దేవరకొండ రెండో స్థానంలో నిలిచాడు. బాలీవుడ్ స్టార్స్ ను మించిన క్రేజ్ సంపాదించుకున్న దీంతో నేషనల్ వైడ్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయాడు. విజయ్ ఇటీవల హైదరాబాద్ టైమ్స్ 'మోస్ట్ డిజైరబుల్ మెన్' లిస్టులో టాప్ ప్లేస్ సంపాదించుకోగా.. ఇప్పుడు నేషనల్ వైడ్ గా రెండో స్థానం సాధించాడు. గతేడాది మూడో ప్లేస్ లో ఉన్న VD ఇప్పుడు రెండో స్థానానికి చేరుకోవడం విశేషం. ఈ జాబితాలో ఆదిత్య రాయ్ కపూర్ (3) - విక్కీ కౌశల్ (4) - దుల్కర్ సల్మాన్ (5) స్థానాల్లో ఉన్నారు. టాలీవుడ్ నుండి రానా దగ్గుబాటి (28) -హర్షవర్ధన్ రాణే (29) కూడా 'టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2020' లిస్ట్‌ లో చోటు దక్కించుకున్నారు.
Tags:    

Similar News