స్టార్ హీరోల గురించి సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక విషయం మీద డిస్కషన్స్ నడుస్తూనే ఉంటాయి. సరదాగా ఫ్యాన్స్ అంతా కలిసి తమ హీరోని ట్విట్టర్ ట్రెండింగ్ లో తీసుకురావాలని కూడా ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో లాస్ట్ 15 డేస్ లో ట్విట్టర్ లో స్టార్స్ గురించి మిలియన్ల కొద్దీ ట్వీట్స్ తో ట్విట్టర్ లో డిస్కషన్స్ నడిచాయి.
ఈ లిస్ట్ లో ముందున్నాడు కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్. ట్విట్టర్ లో గడిచిన 15 రోజుల్లో విజయ్ గురించి (#ThalapathyVijay) 1.72 మిలియన్ ట్వీట్స్ వేశారు. ప్రస్తుతం విజయ్ వంశీ పైడిపల్లి డైరక్షన్ లో వారసుడు సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా ప్రచార చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాటి గురించి ట్విట్టర్ లో ఓ రేంజ్ లో డిస్కషన్ జరిగినట్టు తెలుస్తుంది. అందుకే 15 రోజుల్లో 1.72 మిలియన్ ట్వీట్స్ తో టాప్ లేపుతున్నారు దళపతి ఫ్యాన్స్.
ఈ లిస్ట్ లో సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు ప్రభాస్. ఓ పక్క ఆదిపురుష్ సినిమా సంక్రాంతికి వస్తుందా రాదా.. మరోపక్క మారుతి సినిమా ఉందా లేదా విషయాలపై ప్రభాస్ గురించి ఫ్యాన్స్ ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు #Prabhas అంటూ ఈ 15 రోజుల్లో 1.52 మిలియన్ ట్వీట్స్ ట్రెండింగ్ లో ఉన్నాయి.
ఇక ఆ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ట్విట్టర్ లో హంగామా చేస్తున్నారు. 15 రోజుల్లో 1.13 మిలియన్ ట్వీట్స్ తో మరొక్కసారి ఎన్టీఆర్ పేరుని ట్విట్టర్ లో మోత మ్రోగించారు నందమూరి ఫ్యాన్స్. ఈ లిస్ట్ లో తర్వాత మరో కోలీవుడ్ హీరో అజిత్ కుమార్ పై ట్విట్టర్ లో డిస్కషన్స్ జరిగాయి. #AjithKumar అంటూ గడిచిన 15 రోజుల్లో 1.08 మిలియన్ ట్వీట్స్ వేశారు తల ఫ్యాన్స్. ప్రస్తుతం ఆయన నటిస్తున్న తునివు సినిమా గురించి ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తూ వచ్చారు అజిత్ ఫ్యాన్స్.
ఈ లిస్ట్ లో బాలీవుడ్ లో హీరో అక్షయ్ కుమార్ కూడా ఉన్నారు. 15 రోజుల్లో #AkshayKumar అంటూ 782000 ట్వీట్స్ ట్రెండ్ అయ్యాయి. అక్షయ్ తర్వాత హ్యాష్ ట్యాగ్ రాం చరణ్ (#RamCharan) 652000 ట్వీట్స్, హ్యాష్ ట్యాగ్ మహేష్ బాబు (#MaheshBabu) 618000 ట్వీట్ డిస్కషన్స్ నడిచాయి. చివరగా పుష్ప రాజ్ అదేనండి మన అల్లు అర్జున్ గురించి కూడా హ్యాష్ ట్యాగ్ అల్లు అర్జున్ (#AlluArjun) అంటూ 618000 ట్విట్టర్ డిస్కషన్స్ నడిచాయి. ప్రస్తుతం సౌత్ నార్త్ అనే తేడా లేకుండా అందరు అన్నిచోట్ల సినిమాలు రిలీజ్ చేస్తున్నారు.
అందుకే ఆ సినిమాల గురించి ట్విట్టర్ పిట్ట మోత మ్రోగించేలా ఫ్యాన్స్ డిస్కషన్స్ చేస్తున్నారు. ఈ ట్విట్టర్ ట్రెండింగ్ రికార్డుల్లో కూడా ఫ్యాన్స్ పోటీ పడుతున్నారు. ఏదైనా స్టార్ బర్త్ డే వస్తే చాలు ఫలానా హీరోకి ఇన్ని మిలియన్ ట్విట్టర్ డిస్కషన్స్ వచ్చాయని వారికి పోటీగా మరో హీరో అభిమానులు అది బ్రేక్ చేసేలా ట్విట్టర్ డిస్కషన్స్ చేస్తున్నారు. ట్విట్టర్ లో తమ హీరో గురించి ట్రెండ్ చేయడం అభిమానులకు అదో రకమైన కిక్ అని చెప్పొచ్చు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.