మోస్ట్‌ వెయిటెడ్‌ ఇండియన్ సూపర్‌ హీరో మూవీ అప్డేట్‌

Update: 2022-03-14 02:30 GMT
ఒకప్పుడు హాలీవుడ్ కే పరిమితం అయిన సూపర్ హీరో సినిమాల కాన్సెప్ట్ ని ఇండియన్ ప్రేక్షకుల ముందుకు రోషన్ ఫ్యామిలీ క్రిష్ తో తీసుకు రావడం జరిగింది. బాలీవుడ్ సూపర్‌ స్టార్ హృతిక్‌ రోషన్ హీరోగా ఇప్పటి వరకు క్రిష్ 3 పార్టులుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ మూడు పార్ట్‌ లు కూడా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుని బాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చిత్రాల జాబితాలో నిలిచాయి.

క్రిష్ సినిమా కేవలం హిందీ ప్రేక్షకులను మాత్రమే కాకుండా యావత్ భారత సినీ ప్రేక్షకులను మరియు కొన్ని ఇతర దేశాల ప్రేక్షకులు కూడా అలరించింది. క్రిష్ 3 వచ్చి చాలా సంవత్సరాలు అవుతుంది. ఈ సిరీస్ లో నాలుగవ సినిమాను మొదలు పెట్టబోతున్నగా మేకర్స్ ప్రకటించిన సమయంలోనే కరోనా ఇండియాలో మొదలైంది. దాంతో ఆలస్యం అవుతూ వస్తోంది.

గత చిత్రాల మాదిరిగానే ఈ క్రిష్ కి కూడా రాకేష్ రోషన్ దర్శకత్వం వహించబోతున్నాడు. పలు ఇంటర్వ్యూలో ఆయన క్రిష్ 4 గురించి మాట్లాడుతూ మరింత భారీగా అద్భుతంగా ఉండబోతుందని చెప్పుకొచ్చాడు. ఇప్పటికే స్టోరీ లైన్ సిద్ధం చేసిన రాకేష్ రోషన్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కు రెడీ అయ్యాడు.

 బాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం జూన్ మొదటి వారం లేదా రెండో వారం నుండి ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను అధికారికంగా రాకేష్ రోషన్ మొదలు పెట్టబోతున్నారట.

ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సినిమా మేకింగ్ లో ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను జరుపుతున్నారట. హృతిక్ రోషన్ ప్రస్తుతం తమిళ హిట్ మూవీ విక్రమ్ వేద రీమేక్ లో నటిస్తున్నాడు. ఆ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా ఇప్పటికే ప్రకటించారు.

ఇక మరో వైపు హృతిక్ రోషన్ ఫైటర్ అనే సినిమాలో కూడా నటించబోతున్నాడు. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఆ సినిమా వచ్చే ఏడాది సెప్టెంబర్ లో విడుదల కాబోతుంది. ఫైటర్ సినిమా తర్వాత క్రిష్ 4 సినిమా పట్టాలెక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. క్రిష్‌ 4 మేకింగ్ కి కనీసం రెండు సంవత్సరాలకు పైగానే పట్టే అవకాశం ఉంది.

కనుక బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు ఇండియన్ సినీ ప్రేక్షకులు 2025 లో క్రిష్ 4వ పార్ట్ ని చూసే అవకాశాలు ఉన్నాయంటూ బాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. క్రిష్ 4 ఎప్పుడు వచ్చినా బ్లాక్ బస్టర్ ఖాయం అనే నమ్మకంతో అభిమానులు వెయిట్‌ చేస్తున్నారు.


Tags:    

Similar News