నటవారసుడిని హీరోగా తెరకు పరిచయం చేయడం అంటే అది ఎమోషనల్ ఘట్టం. అలాంటి అరుదైన సన్నివేశంలో నటి భాగ్యశ్రీ ఎమోషన్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ''యే నికమ్మా బడా కామ్ కా హై'' అంటూ భాగ్యశ్రీ తన కొడుకు అభిమన్యు దాసాని గురించి వర్ణించేస్తూ ఎమోషనల్ అయ్యారు. తెలుగు హిట్ సినిమా ఎంసీఏ (నాని హీరో) రీమేక్ 'నికమ్మ' సినిమాతో అభిమన్యు దాసానీ బాలీవుడ్ లోకి అడుగుపెట్టబోతున్నాడు. మేకర్స్ తాజాగా ట్రైలర్ ను విడుదల చేసారు. భాగ్యశ్రీ అభిమానులు - శ్రేయోభిలాషుల నుండి వార్మ్ వెల్ కం దక్కింది.
ట్రైలర్ లాంచ్ సందర్భంగా అభిమన్యు తల్లిగారు.. ప్రముఖ సూపర్ స్టార్ భాగ్యశ్రీ భావోద్వేగానికి లోనయ్యారు. తన కొడుకు సినిమా కోసం చాలా కష్టపడ్డాడని చెప్పారు. అతనిపై ప్రశంసలు కురిపిస్తూ అభిమన్యు పూర్తి అంకితభావంతో పనిచేశారని .. అతను అందరి హృదయాల్లో స్థానం సంపాదించాలని తాను కోరుకుంటున్నానని భాగ్యశ్రీ తెలిపింది.
నీకమ్మ ట్రైలర్ ఆద్యంతం మెరుపులు మెరిపించింది. అభిమన్యు దస్సాని- శిల్పా శెట్టి - షిర్లీ సెటియా నటించిన ఈ చిత్రం వినోదభరితమైన ప్రయాణంలా కనిపిస్తోంది. ట్రైలర్ లాంచ్ సందర్భంగా ఆమె అందరినీ కంటతడి పెట్టించింది. తన వారసుడు నటించిన నిక్కమ్మ ట్రైలర్ ఎలా ఉంది అంటూ అందరినీ భాగ్యశ్రీ అడిగారు. అప్పుడు ఆమె ''ఇది అద్భుతమైన వర్క్ కాదా? ఈ సినిమాలో చాలా ఎఫర్ట్ పెట్టాడు. ఈ సినిమా షూటింగ్ కూడా కోవిడ్-19 సమయంలో రెండేళ్లపాటు సాగింది. ఈ నీకమ్మ కోసం అందరూ థియేటర్లకు రావాలి కాబట్టి ఈ సినిమాను థియేటర్లలో మాత్రమే విడుదల చేయాలని ప్రొడక్షన్ హౌస్ కూడా వేచి ఉంది'' అని తెలిపింది.
కొడుకు అభిమన్యు దాసానిని పొగిడేస్తూనే భాగ్యశ్రీ కాస్త షేక్ అవుతూ కన్నీళ్లు పెట్టుకుంది. నీకమ్మ జూన్ 17న థియేటర్లలోకి వస్తోంది. ఇందులో శిల్పాశెట్టి కుంద్రా- షిర్లీ సెటియా- సునీల్ గ్రోవర్- దీప్రాజ్ రాణా- నరేన్ కుమార్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
నాని- సాయి పల్లవి జంటగా నటించిన ఎంసీఏ చిత్రం హిందీలో నికమ్మగా రీమేక్ అవుతుండగా.. మేటి క్లాసిక్ నటి భాగ్య శ్రీ కుమారుడు అభిమన్యు దాసాని ఈ చిత్రంతో తెరకు పరిచయమవుతుండడంతో తెలుగు ఇండస్ట్రీలోనూ కొంత చర్చ సాగుతోంది. అయితే ఈ ట్రైలర్ ని చూశాక .. ఒరిజినల్ కంటే డిఫరెంట్ గా చేయాలన్న ప్రయత్నం కనిపిస్తోంది. ఎంసీఏలో భూమిక పోషించిన వదిన పాత్రలో బాలీవుడ్ టాల్ బ్యూటీ శిల్పాశెట్టి నటించింది.
MCA హిందీ రీమేక్ లో భూమిక పాత్రను శిల్పాజీ రిపీట్ చేస్తున్నారు. ఇక ఇందులో శిల్పా పాత్రలో కామెడీ అంశాలు ఉన్నాయి. ట్రైలర్ లో శిల్పా కామెడీ చాలా సరదాగా ఉంది. కానీ ట్రైలర్ లోని చివరి భాగం యాక్షన్ ప్యాక్డ్ ప్యాకేజీ గా ఉంది. నీకమ్మ చిత్రానికి సబ్బీర్ ఖాన్ దర్శకత్వం వహించారు. ట్రైలర్ లో ఉత్తరాది ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా ఒరిజినల్ చిత్రంతో పోలిస్తే ఎక్కువ డ్రామా - రొమాన్స్ జోడించారు. జూన్ 17న ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేస్తున్నారు.
Full View