వెండి తెరపై మదర్‌ థెరీసా

Update: 2019-03-11 07:59 GMT
ఎక్కడో పుట్టి మన దేశ ప్రజల కోసం ఎంతో చేసిన గొప్ప మనిషి మదర్‌ థెరీసా. ఇండియాలో వేలాది మందికి - లక్షలాది మందికి అమ్మ అయిన మదర్‌ థెరీసాను భారతరత్న అనే అత్యున్నత పురష్కారంతో కూడా మన ప్రభుత్వం గౌరవించింది. 1997లో మరణించిన మదర్‌ థెరీసా బయోపిక్‌ కు ఇప్పుడు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అన్ని భాషల్లో కూడా ప్రస్తుతం బయోపిక్‌ ల ట్రెండ్‌ నడుస్తున్న నేపథ్యంలో మదర్‌ థెరీసా వంటి గొప్ప వ్యక్తుల బయోపిక్‌ లు ఈ తరం వారికి చాలా అవసరం అంటూ బాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్స్‌ ఈ బయోపిక్‌ ను ముందుకు తీసుకు వచ్చారు.

మధర్‌ థెరీసా గురించి ఇప్పటికే సీమా ఉపాధ్యాయ్‌ 'మదర్‌ థెరీసా : ది సెయింట్‌' అనే పుస్తకాన్ని రచించడం జరిగింది. ఇప్పుడు సీమానే బయోపిక్‌ కు దర్శకత్వం వహించబోతున్నారు. మదర్‌ థెరీసా బుక్‌ కు మంచి స్పందన దక్కింది. అలాగే ఇప్పుడు సినిమాకు కూడా తప్పకుండా మంచి రెస్పాన్స్‌ వస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. వెండి తెరపై 2020వ సంవత్సరంలో మదర్‌ థెరీసాను చూడబోతున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.

సీమా ఉపాధ్యాయ్‌ దర్శకత్వం వహించబోతున్న ఈ చిత్రంకు ప్రదీప్‌ శర్మ - నితిన్‌ మన్మోహన్‌ - గిరీష్‌ జోహార్‌ - ప్రాచీ మన్మోహన్‌ లు సంయుక్తంగా నిర్మించబోతున్నారు. బాలీవుడ్‌ తో పాటు హాలీవుడ్‌ నటీనటులు కూడా ఈ చిత్రంలో నటించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇప్పటికే మదర్‌ థెరీసా గురించిన డాక్యుమెంట్లు చాలానే వచ్చాయి. వాటన్నింటికి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. అయితే ఈసారి కాస్త సినిమాటిక్‌ గా బయోపిక్‌ ను తెరకెక్కించేందుకు మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే మదర్‌ థెరీసా పాత్రలో నటించేది ఎవరనే విషయంపై క్లారిటీ ఇవ్వనున్నారట.
Tags:    

Similar News