నాగిని మౌనిరాయ్ బికినీ బీచ్ సెలబ్రేష‌న్

Update: 2022-07-17 14:30 GMT
బాలీవుడ్ నటి మౌనిరాయ్ అక్ష‌య్ కుమార్ స‌ర‌స‌న `గోల్డ్` అనే చిత్రంతో బాలీవుడ్ లో ప్ర‌వేశించింది. ఆ త‌ర్వాత సౌత్ లో కేజీఎఫ్ లాంటి క్రేజీ చిత్రంలో ఐట‌మ్ నంబ‌ర్ లో మెరిసింది. తెలుగులో ఈ భామ క‌థానాయిక‌గా రంగ ప్ర‌వేశం చేయ‌నుంద‌ని టాక్ వినిపించినా వీలుప‌డ‌లేదు.

ఇంత‌లోనే ఈ ఏడాది జ‌న‌వ‌రిలో ప్రియుడు సూరజ్ నంబియార్ తో మౌని షికార్ల‌పై గుస‌గుస‌లు వినిపించాయి. ఆ త‌ర్వాత అత‌డితో పెళ్లి వ్య‌వ‌హారం.. విహార‌యాత్ర‌ల‌తో జాలీ లైఫ్ గురించి తెలిసిందే. ప్ర‌స్తుతం మౌని నాగిన్ సిరీస్ లో న‌టిస్తూనే చిన్న గ్యాప్ ఇచ్చింది. ఇంత‌లోనే మౌని రాయ్ త‌న భ‌ర్త నంబియార్ తో క‌లిసి వెకేషన్ కి బ‌య‌ల్దేరింది. తన ఇన్ స్టాగ్రామ్ టైమ్ లైన్ లో కొన్ని వేడెక్కించే ఫోటోల‌ను మౌని షేర్ చేసింది. ఈ నెల మొదటి వారం నుండి ఈ జంట‌ వెకేష‌న్ మోడ్ లో ఉంది. పాతిక రోజులుగా తన ఫాలోవ‌ర్స్ ని బికినీ ఫోటోల‌తో టీజ్ చేస్తోంది మౌని. తాజాగా బ్లూ బికినీలో క‌నిపించిన ఫోటోల‌ను షేర్ చేసింది.

త‌న బ్యాక్ లెస్ ఫోటోల‌ను షేర్‌ చేసి వాటికి ఆస‌క్తిక‌ర క్యాప్షన్ ఇచ్చింది. నీలి రంగు బికినీలో నీలి స‌ముద్రాన్ని వీక్షిస్తూ త‌న్మ‌యంలో మునిగిపోయిన ఫోటోలు.. మేఘావృతమైన సూర్యాస్తమయాలను చూస్తూ ఉన్న‌ప్ప‌టి ఫోటోలు.. వైట్ అండ్ వైట్ లుక్ ఫోటోలు ఇప్పుడు వైర‌ల్ గా మారుతున్నాయి. ప్ర‌తి ఫ్రేమ్ లోనూ మౌని ఎంతో అందంగా క‌నిపిస్తోంది.

ఎట్ట‌కేల‌కు మౌని వెకేష‌న్ ముగించి తిరిగి ఇండియాకి వ‌చ్చింది. రాగానే త‌న హ‌బ్బీని మిస్స‌వుతున్నాన‌ని మెసేజ్ పెట్టింది. `కొన్ని గంటలు గ‌డిచాయి.. నేను ఇప్పటికే మిమ్మల్ని మిస్ అవుతున్నాను…!`` అంటూ మౌని వ్యాఖ్య‌ను ఈ ఫోటోకి జోడించింది.

నిజానికి బిజీ సిటీ లైఫ్ కి తిరిగి వచ్చినప్పుడు తార‌ల‌కు మాల్దీవులను మిస్ అవుతున్న విష‌యం అర్థ‌మ‌వుతుంది. మౌని రాయ్ కూడా అలాగే ఫీల‌వుతోంది. బీచ్ ప‌రిస‌రాల‌లోని ప్రకాశవంతమైన నీలిరంగు బికినీలో ఉన్న‌ప్ప‌టి కొన్ని ఫోటోల‌ను మౌని షేర్ చేసి.. తాను మానసికంగా ఇక్కడ ఉన్నాను అని చెప్పింది. అంటే మాల్దీవుల‌ను విడిచిపెట్ట‌డం త‌న‌కు ఎంత‌మాత్రం ఇష్టం లేద‌న్న‌మాట‌.
Tags:    

Similar News