ఈ హీరో కూడా డబ్బు మనిషి కాదన్నమాట!

Update: 2022-08-13 10:58 GMT
సినిమా ప్రపంచంలో తారలు ఏం మాట్లాడినా అలాగే ఏం చేసినా కూడా చాలా తొందరగా వైరల్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా సోషల్ మీడియా ప్రభావం ఎక్కువయిన తర్వాత సెలబ్రిటీల కు సంబంధించిన విషయాలతోనే  ఎక్కువగా ఫోకస్ చేయడం స్టార్ట్ చేశారు. ఇక ఇటీవల కాలంలో కొంతమంది సెలబ్రిటీలు మాట్లాడే విధానం అలాగే వారు డబ్బు కారణంగా తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు కూడా చాలా నెగిటివ్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తున్నాయి.

ముఖ్యంగా బ్రాండ్ యాడ్ ఎండోరౌర్స్మెంట్ విషయంలో అయితే కొందరు సినీ స్టార్స్ ఒప్పుకుంటున్న బ్రాండ్స్ ఏమాత్రం ఆమోదయోగ్యమైనవి కావు అనే చెప్పాలి. అయితే ఈ విషయంలో కొంతమంది డబ్బుకు ఏమాత్రం టెంప్ట్ కాకుండా వారిని అనుసరించే అభిమానులకు ఒక మంచి స్ఫూర్తిగా నిలుస్తున్నారు అని చెప్పవచ్చు. ఇటీవల కాలంలో అల్లు అర్జున్ ఒక పాన్ మసాలా యాడ్ తో పాటు అలాగే ఆల్కహాల్ కు సంబంధించిన బ్రాండ్ ను రిజెక్ట్ చేసిన విషయం తెలిసిందే.

వాళ్ళు కోట్లల్లో పారితోషికం ఇస్తామని అన్నప్పటికీ కూడా అల్లు అర్జున్ అందుకు ఏమాత్రం ఒప్పుకోలేదు. ఇంకా అదే తరహాలో ఇటీవల మరొక హీరో కూడా రిజెక్ట్ చేసినట్లుగా తెలుస్తోంది.

తమిళ నటుడు శింబు గతంలో కాంట్రవర్సీ విషయాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలిచాడు. అయితే అతను ఇటీవల ఒక మద్యపానం బ్రాండ్ కు సంబంధించిన ప్రకటనలో నటించే ఆఫర్ అందుకున్నాడు. అందుకోసం అతనికి 7 కోట్లకు పైగానే పారితోషికం కూడా ఇస్తామని అన్నారట.

కానీ శింబు మాత్రం అందుకు ఒప్పుకోలేదు. తనను అనుసరించే యువత ఎంతో కొంత మంది ఉంటారు కాబట్టి వారిని తప్పుదోవ పట్టించే ఈ తరహా సంపాదన నాకు వద్దు అని చాలా నిర్మొహమాటంగా రిజెక్ట్ చేసినట్లుగా తెలుస్తోంది.

దీంతో అతనిపై తమిళ మీడియాలో అయితే చాలా పాజిటివ్గా ప్రశంసలు వస్తున్నాయి. ఏదేమైనా కూడా శింబు కాంట్రవర్సీ విషయాల్లో ఉన్నప్పటికీ మాత్రం జనాలకు హాని కలిగించే విధంగా తప్పుడు ప్రచారాలు మాత్రం చేయడం లేదు అనేది మెచ్చుకోదగిన విషయమని అంటున్నారు.
Tags:    

Similar News