టాలీవుడ్ హీరో డెబ్యూ మూవీ రిలీజ్ విషయంలో మేకర్స్ మల్లగుల్లాలు పడుతున్నారని తెలుస్తోంది. ఓ పెద్ద ఫ్యామిలీ నుంచి ఇంట్రడ్యూస్ అవుతున్న హీరో సినిమాని నిర్మించడానికి పెద్ద ప్రొడక్షన్ హౌస్ ముందుకు వచ్చింది. టాలీవుడ్ లో స్టార్ హీరోలతో సినిమాలు తీస్తూ వస్తున్న సదరు నిర్మాణ సంస్థ.. డెబ్యూ హీరో అయినప్పటికీ ఫ్యామిలీ క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని భారీగానే ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. అందులోనూ ఈ సినిమాకి మరో స్టార్ డైరెక్టర్ సహకారం కూడా ఉండటంతో పెట్టిన పెట్టుబడి ఈజీగా రాబట్టొచ్చని అనుకున్నారు. అయితే అదే సమయంలో కరోనా మహమ్మారి వచ్చి థియేటర్స్ క్లోజ్ అయ్యేలా చేసి వారి ఆశలకు కళ్లెం వేసింది. ఈ నేపథ్యంలో గత కొన్ని నెలల నుంచి థియేటర్స్ ఓపెన్ చేస్తే రిలీజ్ చేయాలని వెయిట్ చేస్తూ ఉన్నారు. అదే సమయంలో ఈ సినిమాకి అనేక కత్తెరలు వేసుకుంటూ వస్తున్నారు.
అయితే ఎన్నాళ్ళు వెయిట్ చేసినా థియేటర్స్ ఎప్పుడు రీ ఓపెన్ చేస్తారనే మీద క్లారిటీ రాకపోవడంతో.. ఓటీటీలో రిలీజ్ చేస్తారంటూ వార్తలు వచ్చాయి. అయితే డెబ్యూ హీరో డెబ్యూ డైరెక్టర్ ని నమ్మి మేకర్స్ చెప్పే రేట్ కి ఓటీటీలు ముందుకు రావడం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉన్న ప్రొడ్యూసర్స్ కి.. నిర్మాణ భాగస్వామి అయిన స్టార్ డైరెక్టర్ ఈ సినిమాని కచ్చితంగా థియేటర్స్ లో రిలీజ్ చేద్దాం అని సలహా ఇస్తున్నాడట. థియేటర్స్ లో విడుదల చేస్తే 100 కోట్ల సినిమా అవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నాడట. ఎలాగైనా సంక్రాంతి సీజన్ లో రిలీజ్ చేద్దామని కాన్ఫిడెన్స్ నింపుతున్నాడట. ఇదంతా బాగానే ఉంది కానీ 100 కోట్లు అనడమే చాలా కామెడీగా ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో కామెంట్స్ చేస్తున్నారు.