సినిమావోళ్లకు ఒకటి కంటే రెండోదే ముద్దా?

Update: 2017-02-10 17:30 GMT
ఓ సినిమా ఊహించని విజయం సాధించిందంటే.. దానికి సీక్వెల్ సిద్ధం చేసేయడం అనే ట్రెండ్ ఎప్పటి నుంచో ఉన్నా టాలీవుడ్ లో మాత్రం ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. దేశవ్యాప్తంగా అయితే.. ఇప్పుడు సీక్వెల్స్ సీజన్ మాంచి జోష్ లో ఉంది. మొదటి భాగం కంటే రెండో పార్ట్ కోసం చాలా జాగ్రత్తలు తీసుకోవడమే కాదు.. భారీ మొత్తంలో వెచ్చించేందుకు వెనకాడ్డం లేదు ఫిలిం మేకర్స్.

రజినీకాంత్-శంకర్ ల కాంబినేషన్ లో రోబోకు సీక్వెల్ గా 2.0 రూపొందుతున్న విషయం తెలిసిందే. రెండో భాగం కోసం విలన్ గా అక్షయ్ కుమార్ ను తీసుకొచ్చి.. ఇండియా వైడ్ గా క్రేజ్ పెంచారు. పైగా 400 కోట్ల బడ్జెట్ కేటాయించారు. బాహుబలి విషయానికి వస్తే.. బడ్జెట్ సంగతి పైకి చెప్పడం లేదు కానీ.. మొదటి పార్ట్ కంటే.. బాహుబలి ది కంక్లూజన్ కి చాలా ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రఘువరన్ బీ టెక్ అంటూ వచ్చిన వీఐపీ చిత్రం సీక్వెల్ రూపొందనుంది. ఇప్పుడు బాలీవుడ్ సీనియర్ బ్యూటీ కాజోల్ ని వీఐపీ2లో భాగం చేసి.. నేషనల్ వైడ్ గా క్రేజ్ తెచ్చేందుకు యత్నిస్తున్నారు. రాజు గారి గది అంటూ లో బడ్జెట్ తోనే దర్శకుడు ఓంకార్ సైలెంట్ హిట్ కొట్టాడు. ఇవి భారీ బడ్జెట్ సినిమాల సంగతులైతే.. చిన్న సినిమాల సీక్వెల్స్ కూడా పెద్దవిగా మారిపోతున్నాయి.

ఇప్పుడు రెండో భాగం కోసం నాగార్జునను కీలక పాత్రలోకి తీసుకుని.. పెద్ద సినిమా చేసేశాడు. సమంతను కూడా మరో ముఖ్య పాత్రలోకి తీసుకోవడం విశేషం. గుంటూరు టాకీస్ చిత్రాన్ని కేవలం రష్మీ గౌతమ్ అందాలనే పెట్టుబడి గా చేసి సక్సెస్ సాధించారు. ఇప్పుడీ మూవీలో సన్నీలియోన్ ని భాగం చేయడంతో.. తెలుగు-తమిళ్-హిందీల్లో కూడా రిలీజ్ చేసే అవకాశం చిక్కుతోంది. ఆల్రెడీ మొదటి భాగానికి క్రేజ్ ఏర్పడ్డాక.. సీక్వెల్ విషయంలో మేకర్స్ ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News