ఒకప్పుడు సినిమాలలో హీరోహీరోయిన్లు చాలా పద్ధతిగా కనిపించేవారు. అసభ్యతకు తావు లేకుండా సాంప్రదాయబద్దంగా కనిపించేవారు కథానాయికలు. కాలం మారుతున్న కొద్దీ సినీ ఇండస్ట్రీలో కూడా అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. గ్లామర్ పేరుతో హీరోయిన్లు ఎక్స్ పోజింగ్ చేయడం మొదలుపెట్టారు.. కానీ అది కూడా ఒక లిమిట్ వరకే ఉండేది.
ఈ క్రమంలో బికినీలు - పొట్టి పొట్టి దుస్తుల్లో కనిపించి అందాల ఆరబోతకు తెర లేపారు. నటనకు ప్రాధాన్యత ఇవ్వడం కంటే.. గ్లామర్ షోకు ఎలాంటి అభ్యంతరం చెప్పని భామలను హీరోయిన్లుగా తీసుకునే వరకూ వచ్చింది. సెన్సార్ నిబంధనలకు లోబడి ప్రేక్షకులకు అందాల కనువిందు చేస్తూ వచ్చారు.
పోను పోను ఇండస్ట్రీలో ట్రెండ్ మారింది. హీరోయిన్లతో పాటుగా హీరోలు కూడా ఎక్స్ పోజింగ్ చేసే పరిస్థితి వచ్చింది. ప్రతి ఒక్కరూ తమ కండలు తిరిగిన దేహాన్ని ప్రదర్శించడానికి మొగ్గు చూపారు. సిక్స్ ప్యాక్ - ఎయిట్ ప్యాక్ అంటూ షర్ట్ లేకుండా బాడీని చూపించారు. కాకపోతే ఇది కూడా ఒక పరిధి మేరకే ఉండేది.
కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే నెక్స్ట్ జెనెరేషన్ హీరోలంతా ఎక్స్ పోజింగ్ మీదనే దృష్టి పెట్టబోతున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల కాలంలో న్యూ ట్రెండ్ పేరుతో సినీ ప్రపంచంలో కొంత మంది సినీతారల నిర్వాహకాలు ఊహలకు అందని విధంగా ఉంటున్నాయి.
ఓవైపు అందర్ని ఆకట్టుకోవాలని హీరోయిన్స్ గ్లామర్ ట్రీట్ ఇస్తుంటే.. మరోవైపు హీరోలు సైతం మాకేమి తక్కువ అంటూ బాడీని ఎక్స్ పోజ్ చేస్తున్నారు. కొన్నిసార్లు కథానాయికలు అర్ధనగ్నంగా కనిపించి షాక్ ఇస్తుంటే.. మన హీరోలు ఏకంగా నగ్నంగా ఫోజులు ఇస్తూ ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు.
సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు కొత్తగా 'న్యూడ్' ట్రెండ్ నడుస్తోంది. 'పీకే' సినిమాలో బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ - రణబీర్ కపూర్ లు రేడియోలు అడ్డుపెట్టుకుని నగ్నంగా కనిపిస్తే.. దానికి స్పూఫ్ గా మన సంపూర్ణేష్ బాబు ఏకంగా క్యాలీఫ్లవర్ తో పొజిచ్చిన సంగతి తెలిసిందే.
నేను ట్రెండ్ ఫాలో అవ్వను.. ట్రెండ్ సెట్ చేస్తా అన్నట్లు వ్యవహరించే రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఇటీవల ఏకంగా ఓ బోల్డ్ పోస్టర్ తో సంచలనం సృష్టించాడు. ఒంటి మీద నూలు పోగు లేకుండా గులాబీ గుచ్చాన్ని అడ్డుపెట్టుకుని న్యూడ్ పోజ్ ఇచ్చాడు వీడీ. ఈ ఫోటో నెట్టింట పెద్ద దుమారమే రేపింది.
ఇదే క్రమంలో ఇటీవల బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ న్యూడ్ ఫోటో షూట్ చేయడం హాట్ టాపిక్ అయింది. కాస్మోపాలిటన్ మ్యాగజైన్ కోసం రణ్వీర్ సింగ్ ఒంటిపై ఎలాంటి దుస్తులు లేకుండా ఫోటో షూట్ నిర్వహించాడు. 70వ దశకంలో న్యూడ్ ఫోటో షూట్ చేసిన పాప్ ఐకాన్ బర్ట్ రేనేల్డ్స్ నివాళిగా.. ఇప్పుడు రణ్ వీర్ ఇలా దర్శనమిచ్చాడు. గతంలో 'బేఫికరే' సినిమా కోసం రణవీర్ సింగ్ నగ్నంగా నటించి ట్రోలింగ్ ఎదుర్కొన్నాడు.
మరో బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం కూడా ఇదే తరహాలో ఫోటోలకు న్యూడ్ గా ఫోజులు ఇవ్వడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఇప్పుడు రణ్వీర్ మరోసారి ఈ న్యూడ్ ట్రెండ్ లో పాల్గొన్నాడు. దీంతో పలువురు హీరోలు అతడిని అనుసరిస్తూ నగ్న ఫోటోషూట్లతో రెచ్చిపోతున్నారు. సౌత్ హీరో విష్ణు విశాల్ కూడా ఈ ట్రెండ్ ను ఫాలో అయ్యాడు. అర్థ నగ్నంగా ఫోటోలను షేర్ చేసాడు. ఈ ఫోటోలు తీసింది కూడా తన భార్య గుత్తా జ్వాలా అని సగర్వంగా ప్రకటించాడు.
నగ్నంగా కనిపించే ట్రెండ్ హాలీవుడ్ లో ఎప్పటినుంచో కొనసాగుతూనే ఉంది. కానీ సోషల్ మీడియా ప్రభావం పెరిగిన తర్వాత ఇప్పుడు ఇండియన్ యాక్టర్స్ సైతం ఇలా న్యూడ్ గా కనిపిస్తుండటంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. న్యూ ట్రెండ్ పేరుతో సినీ తారలు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారంటూ నెటిజన్లు ఫైరవుతున్నారు.
సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతోందంటే ఇదేనా అని చీల్చి చెండాడుతున్నారు. న్యూడ్ ఫోజులు ఇవ్వడం ద్వారా సభ్య సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని? ప్రశ్నిస్తున్నారు. పాశ్చాత్యీకరణ అనేది ఆధునికీకరణ అనిపించుకోదని.. భారతీయ నటీనటులు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని నడుచుకుంటే మంచిదని విరుచుకుపడుతున్నారు.
పబ్లిక్ లైఫ్ లో ఉంటారు కాబట్టి సెలబ్రిటీలు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని హితబోధ చేస్తున్నారు. ఇదిలాగే కొనసాగితే రానున్న రోజుల్లో అందరూ సినిమా అంటేనే హీరోహీరోయిన్ల ఎక్స్ పోజింగ్ అనుకునే అవకాశం ఉందని కామెంట్స్ చేస్తున్నారు.
రణ్ వీర్ సింగ్ నగ్న ఫొటోలపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పలువురు రోడ్లపైకి వచ్చి బాలీవుడ్ స్టార్ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సోషల్ మీడియాలో తన నగ్న ఫోటోలతో మహిళల మనోభావాలను దెబ్బతీసాడని.. వారిని అగౌరపరిచేలా వ్యవహరించారంటూ సామాజిక కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కేసులు కూడా నమోదు చేస్తున్నారు.
రణ్ వీర్ సింగ్ ఒక మానసిక రోగి అంటూ బ్యానర్లు కడుతున్నారు. నూలు పోగు కూడా లేకుండా ఉన్న రణ్ వీర్ కు దుస్తులు సేకరించి పంపిస్తున్నారు. చూస్తుంటే ఈ వివాదానికి ఇప్పుడప్పుడే ఫుల్ స్టాప్ పడేలా లేదనిపిస్తోంది. వివాదాస్పద దర్శకుడు న్యూడ్ ట్రెండ్ పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ కొత్త డిమాండ్ ను తెరపైకి తీసుకొచ్చారు.
''నేను వ్యక్తిగతంగా అభినందిస్తున్నాను. మెజారిటీ వర్గం రణవీర్ సింగ్ న్యూ ఏజ్ ధైర్యాన్ని మెచ్చుకోవడం చూసి నేను కూడా థ్రిల్ అయ్యాను. స్త్రీలు కూడా ఇలాగే చేస్తే వారంతా ఎంతగానో మెచ్చుకుంటారని ఆశిస్తున్నాను. దేంట్లో అయినా లింగ సమానత్వం ఉండాలి'' అని ఆర్జీవీ ట్వీట్ చేశారు.
అక్కడితో ఆగకుండా రణవీర్ న్యూ ఏజ్ న్యూడ్ ఫోటోల సందర్భంలో ఇక్కడ ఒక ప్రశ్న తెలెత్తుతోంది. స్త్రీల నగ్న చిత్రాలను చూసి పురుషులు ఆనందించినంతగా.. పురుషుడి నగ్న చిత్రాలను చూసి మహిళలు ఆనందిస్తారా? అంటూ వర్మ ట్విట్టర్ లో పోల్ కూడా పెట్టాడు. దీనికి మెజారిటీ వర్గం 'అవును' అని ఓట్ వేయడం గమనార్హం. మరి రాబోయే రోజుల్లో ఈ న్యూడ్ ట్రెండ్ ఎక్కడి దాకా వెళ్తుందో చూడాలి.