ఏదైనా పెళ్లి కుదిర్చే సమయంలో ముందు వెనుకా ఏడు తరాలు చూడాలి అంటారు పెద్దలు. ఇప్పుడు సినిమాల విడుదల విషయంలోనూ ముందు వెనుకా ఒకటికి పది సార్లు అలోచించి కానీ వదల్లేని పరిస్థితులు నెలకొన్నాయి. అందుకే నిర్మాతలు చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. పోటీగా ఉన్న సినిమాలతో పాటు సామాజిక పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి వస్తోంది. డిసెంబర్ లో రిలీజ్ ల మధ్య భారీ పోటీ నెలకొన్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 7 నుంచి ప్రారంభం కాబోయే ఈ జాతర జనవరి చివరి దాకా కొనసాగుతూనే ఉంటుంది.
కాకపోతే ఈ ఏడో తేదితోనే అసలు చిక్కు అంటున్నారు విశ్లేషకులు. కారణం ఆ రోజు తెలంగాణా సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. జనాలు సినిమాలు చూసే మూడ్ లో పెద్దగా గారు. పైగా ముందస్తు ఎలక్షన్స్ కాబట్టి అధికారంలో ఉన్న టిఆర్ఎస్ తో సహా అన్ని పార్టీలు కనివిని ఎరుగని స్థాయిలో ఏర్పాట్లు ప్రచారం చేసేసాయి. సో ఓటర్లు భారీ ఎత్తున పోలింగ్ బూతులకు వెళ్ళే అవకాశాలు చాలా ఉన్నాయి.
డిసెంబర్ 7కి సుమంత్ సుబ్రమణ్యపురం ఫిక్స్ చేసారు. బెల్లం కొండ శ్రీనివాస్ కవచం కూడా అదే డేట్ అని ఇంతకు ముందు ప్రకటించారు కాని ఇప్పుడు మళ్ళి పునరాలోచనలో పడ్డట్టు టాక్. శుభలేఖలు అనే మరో చిన్న సినిమా కూడా ఇదే తేదిన వస్తోంది. సోషల్ మీడియాలో దీని మీద బాగానే ప్రచారం జరుగుతోంది. సందీప్ కిషన్-తమన్నాల నెక్స్ట్ ఏంటి కూడా కర్చీఫ్ వేసింది. హుషారు అనే మరో సినిమా సైతం క్యు లో ఉంది. ఎన్నికలు ఒక్క రోజే కదా తర్వాత వీటికి సమస్య ఉండదు కదా అనే అనుమానం రావొచ్చు.
పైగా ఆంధ్ర ప్రదేశ్ లో లేవు కాబట్టి అక్కడ రన్ బాగుండొచ్చు అనేది నిర్మాతల ఆలోచన. కాని ఏ సినిమాకైనా నైజాం చాలా కీలకం. జనం ఫలితాలు వచ్చే దాకా టీవీ సెట్ల నుంచి రాజకీయ విషయాల నుంచి జనాలు దృష్టి పక్కకు మరల్చే అవకాశం తక్కువ. అలాంటప్పుడు ఓపెనింగ్స్ మీద ప్రభావం ఉండకుండా పోదు. అందుకే డిసెంబర్ 7న వచ్చే సినిమాలకు ఈ రిస్క్ అయితే ఉంది. చూడాలి ఏం జరుగుతుందో