సినిమా ప్రమోషన్ ఎన్ని రకాలుగా ఉన్నా వెనుకనుంచి నడిపించే పిఆర్ ల పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. మీడియాకు యూనిట్ కు మధ్య అనుసంధానంగా ఉంటూ కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా చూసుకుని పబ్లిసిటీని చక్కగా చేయడం వీళ్ళ ప్రధాన కర్తవ్యం. ఇందులోనే రాణించి నిర్మాతలుగా ఎదిగిన వాళ్ళు ఉన్నారు. బాధ్యతలు సరిగా నిర్వర్తించలేక త్వరగా కనుమరుగైన వారూ ఉన్నారు. కాకపోతే ఒక సినిమాకు ఒకరే పిఆర్ గా ఉంటే ఎలాంటి సమస్య లేదు. ఇద్దరు ఉంటేనే తంటాలు.
దీని వల్లే ఓ క్రేజీ సినిమాకు దక్కాల్సిన హైప్ రాలేదని ఇండస్ట్రీ టాక్. విషయానికి వస్తే అదొక పెద్ద స్టార్ ఫ్యామిలి నుంచి వచ్చిన యూత్ హీరో సినిమా. మాస్ అవతారంలో మొదటిసారి తన సాఫ్ట్ ఇమేజ్ ని పక్కనబెట్టి ప్రయోగం చేస్తున్నాడు. ఈ సినిమా ప్రొడక్షన్ తరఫున ఒక పిఆర్ దర్శకుడి వైపు నుంచి మరో పిఆర్ దీనికి సంబంధించిన వ్యవహారాలు చూసుకుంటున్నారు.
ఇటీవలే దీని టీజర్ వచ్చింది. వెరైటీగా ఉందని ఫీడ్ బ్యాక్ తెచ్చుకుంది. ఫాన్స్ కు కూడా నచ్చింది. కానీ దర్శకుడు ఆశించిన రేంజ్ లో మాత్రం కాదు. దీంతో తన తరఫున ఉన్న పిఆర్ ని ఈ దర్శకుడు నిలదీశాడు. టాక్ అఫ్ ది ఇండస్ట్రీగా ఉండాల్సిన టీజర్ జస్ట్ పాస్ అనిపించుకోవడం ఏమిటని మెల్లగా చర్చను వేడెక్కించాడట. దీంతో ఇద్దరి మధ్యా మాట మాట పెరిగి నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయికి చేరుకుందని ఇన్ సైడ్ న్యూస్.
దీంతో దర్శకుడు అనవసరంగా నోరు పారేసుకున్నాడని భావించిన యూనిట్ సభ్యులు ప్రొడక్షన్ టీమ్ డైరెక్టర్ మీద గరంగరంగా ఉన్నారట. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో గందరగోళం ఈ కారణంగానే వచ్చిందని వినికిడి. సెప్టెంబర్ రెండో వారంలో కావాల్సిన ఈ సినిమా సాఫీగా రావాలంటే ఇప్పుడీ గొడవ సద్దుమణగాలి. అందుకే నిర్మాత తరఫున పిఆర్ రంగంలోకి దిగినట్టు సమాచారం. మొత్తానికి దేనికో మొదలైన గాలివాన చివరికిలా తుపానుగా మారిందన్న మాట