పవన్ కళ్యాణ్ లాగే తమిళనాట రాజకీయాల్లోకి ఎప్పుడో వచ్చేసిన కమల్ హాసన్ పార్టీని నడిపించేందుకు సినిమాలే తప్ప మరో దారి లేదని హాట్ కామెంట్స్ చేశారు. పార్టీని నడిపేందుకే సినిమాలు చేస్తున్నానని పవన్ కళ్యాణ్ అప్పట్లో ప్రకటించి ఒకేసారి నాలుగు సినిమాలు పట్టాలెక్కించిన సంగతి తెలిసిందే. అయితే పవన్ కంటే ముందే రాజకీయాల్లోకి వచ్చిన తమిళ సీనియర్ అగ్రనటుడు కమల్ హాసన్ కూడా ఇప్పుడు పార్టీని నడపడానికి సినిమాలే తనకు జీవనాధారం అని హాట్ కామెంట్స్ చేశాడు. సినిమాలు చేయనిదే రాజకీయం చేయలేనన్నారు. పార్టీ ఫండ్ అంతా తనకు సినిమాలు, బిగ్ బాస్ నుంచే వస్తుందని కీలక వ్యాఖ్యలు చేశారు.
టాప్ హీరో కమల్ హాసన్ ఇండియా టుడే కాన్క్లేవ్ సౌత్ -2021 లో తన రాజకీయ సిద్ధాంతాలతోపాటు అనేక విషయాలపై మాట్లాడారు. నటన తనకు రాజకీయాలకు మించినది అని అన్నారు. రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతే తన స్టార్‌డమ్ ప్రమాదంలో పడుతుందా అన్న ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. కమల్ తన నటనా వారసత్వం రాజకీయాలకు మించినది అన్నారు. “నేను ఓడిపోతే, అది ఒక నటుడిగా తనకు అది ముగింపు కాదు. కానీ నటుడిగా ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉంటారు. నా తర్వాత నా అభిమానులు గుర్తుంచుకునే అనేక సినిమాలు రాబోతున్నాయని ”అని కమల్ హాసన్ చెప్పుకొచ్చారు.
బీజేపీకి తాను బి-టీమ్ అని డీఎంకే పార్టీ ఆరోపణలు, ప్రశ్నలకు కమల్ స్పందించారు. అవి కేవలం ఊహాగానాలు మాత్రమే అని స్పష్టం చేశారు. తన పార్టీ కారణంగా డీఎంకే నిద్రలేని రాత్రులు గడుపుతోందని కమల్ హాసన్ విమర్శించాడు. ఈ ‘బీ-టీమ్’ వ్యాఖ్యలు దానిని రుజువు చేస్తున్నాయి. డీఎంకే తన రాజకీయ ప్రత్యర్థి అని చెప్పి కమల్ పాలక ఏడీఎంకేను స్వయం విధ్వంసక పార్టీ అని పిలిచారు.
తన రాజకీయ పార్టీ మక్కల్ నీది మయ్యం(ఎంఎన్ఎం)కు నిధుల కొరత ఉందని వెల్లడించిన కమల్ హాసన్.. వాటిని బిగ్ బాస్ మరియు సినిమాలు చేయడం ద్వారా తన పార్టీకి ఫండ్ సమకూరుస్తున్నట్టు హాట్ కామెంట్స్ చేశారు. పార్టీకి అన్ని సరైన వనరుల నుంచి నిధులు అందుతున్నాయని, తన పార్టీకి నిధుల కొరత ఉందని ఆయన తెలిపారు. రాజకీయాల్లోకి ప్రవేశించకూడదని రజనీకాంత్ నిర్ణయం గురించి అడిగినప్పుడు.. ఇది రజినీ వ్యక్తిగత నిర్ణయం అని కమల్ హాసన్ అన్నారు. కమల్ హాసన్ సినిమాలు మరియు టెలివిజన్లలో పని చేస్తూనే ఉంటానని స్పష్టం చేశాడు.