ప‌క్షమైనా పూర్త‌వ్వ‌కుండానే డిజిట‌ల్ తెర‌పై

Update: 2019-11-01 10:18 GMT
ఆడియెన్ మైండ్ సెట్ మారింది. థియేట‌ర్ల‌కు వ‌చ్చే జ‌నం క్లాసిఫికేష‌న్ చూస్తున్నారు. 3డి సినిమా.. భారీ సినిమా.. చిన్న సినిమా.. నాశి ర‌కం డీ గ్రేడ్ సినిమా.. ఇలా వేరియేష‌న్ చూసి మ‌రీ టిక్కెట్లు బుక్ చేస్తున్నారు. అస‌లు ఈ కొత్త‌ ప‌రిణామం ఎటు దారి తీయ‌బోతోంది? అన్న‌ది ఊహించ‌డ‌మే క‌ష్టంగా ఉంది. ఇప్ప‌టికే వెబ్ సిరీస్ ల వెల్లువ‌లో సినిమా భ‌విత‌వ్యం ఏమిటి? అన్న ఆందోళ‌న క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే చిన్న.. ప‌రిమిత బ‌డ్జెట్ చిత్రాలు.. నాశిర‌కం సినిమాలు చూసేందుకు జ‌నాలు థియేట‌ర్ల‌కు క‌ద‌ల‌డం లేదు. ఇంట్లోనే అమెజాన్ లోనో నెట్ ఫ్లిక్స్ లోనో వ‌చ్చాక చూద్దాంలే! అన్న ధీమా వ‌చ్చేసింది.

మునుముందు ఇది మ‌రింత ప్ర‌మాద‌క‌రంగా మార‌నుంద‌ని సంకేతం అందుతోంది. ఒక‌వేళ ఇదే జ‌రిగితే సెకండ్ గ్రేడ్ హీరోల‌కు అది మ‌రింత కాంప్లికేటెడ్ గా మారుతుంది. ష్యూర్ షాట్ హిట్ చిత్రాల్లో న‌టిస్తేనే హీరోగా నిల‌దొక్కుకునే వీలుంటుంది. లేదంటే వెబ్ సిరీస్ ల‌కు డిజిట‌ల్ షోల‌కు ప‌రిమితం కావాల్సి ఉంటుంది. లేదా శాటిలైట్ రేంజులో సినిమాలు తీసుకుని ముందే సేఫ్ జోన్ ఆలోచించుకోవాలి.

ఇప్ప‌టికే ప‌లువురు స్ట్ర‌గ్లింగ్ హీరోల స‌న్నివేశం ఇలానే ఉంది. న‌వ‌త‌రంలో ఆది సాయికుమార్ ఇటీవ‌ల హీరోగా స్ట్ర‌గుల్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. వ‌రుసగా ఫ్లాపులు ఎదుర‌వుతున్నాయి. దాని నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు అత‌డు చేయ‌ని ప్ర‌య‌త్నం లేదు. అయినా క‌లిసి రావ‌డం లేదు. ఆది న‌టించిన‌ `ఆప‌రేష‌న్ గోల్డ్ ఫిష్` చిత్రం అక్టోబ‌ర్ 18న రిలీజైంది. ఇంకా ఈ సినిమా రిలీజై ప‌క్షం (15రోజులు) అయినా కాక‌ముందే అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కి రెడీ అవుతోంది. నేటి నుంచి ఇది లైవ్ కొచ్చేస్తోంది.

అయితే ఇది దేనికి సంకేతం? అంటే .. స‌క్సెస్ లేని హీరోల మార్కెట్ పై ప్ర‌తికూల ప్ర‌భావమేన‌ని అర్థ‌మ‌వుతోంది. అంత‌గా విష‌యం లేని సినిమాల్లో న‌టిస్తే దాని ప‌ర్య‌వ‌సానం తీవ్రంగా ఉంటుంద‌నేందుకు ఇదో హెచ్చ‌రిక‌. ఇలా అయితే డిజిట‌ల్ కోసం వెయిటింగే క‌రెక్ట్ అనుకునే ఆడియెన్ మైండ్ సెట్ ఛేంజోవ‌ర్ ప్ర‌మాద సంకేతం ఇద‌ని భావించి మ‌న యువ‌హీరోలంతా జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల్సిన స‌న్నివేశం ఉంది.
Tags:    

Similar News