టాప్ స్టోరి: పాత సీసాల్లో కొత్త సారాయి తాగేదెలా?

Update: 2022-08-25 14:53 GMT
మారుతున్న ట్రెండ్ స్ప‌ష్ఠంగా అవ‌గ‌త‌మ‌వుతోంది. ప్రేక్ష‌కుల‌కు లార్జ‌ర్ దేన్ లైఫ్ పాత్ర‌ల‌పై మోజు పెరిగింది. దేశీయ మార్కెట్లోకి ఈ ఛేంజ్ తెచ్చింది మాత్రం బాహుబ‌లి- కేజీఎఫ్ ఫ్రాంఛైజీలేన‌ని అంతా అంగీక‌రిస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్ కూడా అదే మూస‌లోకి వ‌చ్చింది. అయితే ప్ర‌తిసారీ అవే సినిమాల‌ను రిపీట్ చేస్తే తిప్పి కొడుతున్న జనాల వైఖ‌రికి చిన్న‌బోవ‌డం అగ్ర హీరోలు బ‌డా నిర్మాణ సంస్థ‌ల ప‌నిగా మారింది. ఇటీవ‌లి అక్ష‌య్ సామ్రాట్ పృథ్వీరాజ్ .. ర‌ణ‌బీర్ శంషేరా ఈ కేట‌గిరీకే చెందాయి. య‌ష్ రాజ్ ఫిలింస్ లాంటి పెద్ద బ్యాన‌రే చేతులెత్తేసింది. భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైన ఈ రెండు సినిమాలు పాత సీసాలో పోసిన కొత్త సారాయి అని తేలిపోయాయి.

అందుకే జ‌నాల‌కు వెగ‌టు పుట్టి మొహం మొత్తేసి వాటికి దూరం జ‌రిగారు.  ఇక మీద‌ట కూడా వ‌రుస‌గా మాఫియా క‌థ‌లు స్పై ఏజెంట్ క‌థ‌లు ఇలానే వెల్లువ‌లా దూసుకొస్తున్నాయి. ఇటీవ‌ల ఉత్కంఠ రేకెత్తించే ఎన్.ఐ.ఏ ఏజెంట్ క‌థ‌తో అడివి శేష్ మూవీ వ‌చ్చి బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టింది. అంతకుముందు కూడా శేష్ న‌టించిన గూఢ‌చారి స్పై ఆప‌రేషన్ నేప‌థ్యంలో వ‌చ్చి బంప‌ర్ హిట్ కొట్టింది. ఆ త‌రవాత తెలుగు స‌హా ఇత‌ర భాష‌ల్లోనూ వ‌రుస‌గా స్పై నేప‌థ్యం.. ఎన్.ఐ.ఏ నేప‌థ్యంలో సినిమాలొస్తున్నాయి. అయితే ఇవ‌న్నీ జ‌నాల‌కు రీచ్ అయ్యేది ఎంత‌? అంటే సందిగ్ధంగానే ఉంది.

ఇప్ప‌టికిప్పుడు నాగార్జున న‌టిస్తున్న ఘోస్ట్ చిత్రం మాఫియా నేప‌థ్యం.. ఎన్.ఐ.ఏ స్పై ఏజెంట్ నేప‌థ్యంతో వ‌స్తోంద‌ని తాజా ట్రైల‌ర్ వెల్ల‌డించింది. నాగ్ వార‌సుడు అక్కినేని అఖిల్ న‌టిస్తున్న ఏజెంట్ సైతం స్పై ఆప‌రేష‌న్ నేప‌థ్యంలో రానుంది. ఈ మూవీని సురేంద‌ర్ రెడ్డి ఎంతో పట్టుద‌ల‌గా తెర‌కెక్కిస్తున్నారు. ఒక ర‌కంగా బ్లాక్ బ‌స్ట‌ర్ హాలీవుడ్ ఫ్రాంఛైజీ బార్న్ త‌ర‌హా లాజిక్ ల‌తో సాహ‌సాలు చేసే వాడిగా అఖిల్ క‌నిపించ‌నున్నాడు. ఇప్ప‌టికే పోస్ట‌ర్లు టీజ‌ర్ తో హైప్ పెంచారు.

మునుముందు షారూక్ ఖాన్ నుంచి వ‌స్తున్న జ‌వాన్ (అట్లీ ద‌ర్శ‌కుడు) సినిమా నేప‌థ్యం కూడా ఇంచుమించు దుష్ఠ శ‌క్తుల‌ ప‌ని ప‌ట్టే దేశ‌భ‌క్తుని క‌థ‌తో వ‌స్తోంది. షారూఖ్ ఖాన్ న‌టిస్తున్న ప‌ఠాన్ భారీ మాఫియా క‌థాంశంతో కేజీఎఫ్ త‌ర‌హా ఎలివేష‌న్స్ తో రాబోతోంద‌ని హింట్ కూడా అందింది. ఇదంతా చూస్తుంటే పాత సీసాల్లో కొత్త సారాయి ఒంప‌డం లేదు క‌దా! అనే సందేహం కూడా క‌లుగుతోంది.

అయితే పాత వెగ‌టు సారాయి తాగేందుకు ప్ర‌జ‌లు సిద్ధంగా ఉన్నారా? అన్న‌ది చాలా డౌట్లు పెట్టేస్తోంది. పైన పేర్కొన్న సినిమాల కంటెంట్ గ‌తంలో వ‌చ్చిన వాటికి డూప్ గా ఉండ‌క‌పోతేనే జ‌నం ఆద‌రిస్తార‌న‌డంలో సందేహం లేదు. ఎప్పుడో చూసేసిన‌ట్టే ఉందే! అంటూ డౌట్లు రాకూడ‌దు. కంటెంట్ ఫ్రెష్ నెస్ తో ఉండాలి. అప్పుడే జ‌నాద‌ర‌ణ ద‌క్కించుకునే వీలుంటుంది. ఎంపిక చేసిన క‌థ‌లో ద‌మ్ముండాలి. క‌థ‌నాన్ని గ్రిప్పింగ్ గా చూపించాలి. ఇందులోనే ఎమోష‌న్ సెంటిమెంట్లు వ‌ర్క‌వుట్ అయితేనే భార‌తీయ ఆడియెన్ కి క‌నెక్ట‌య్యేందుకు ఛాన్సుంటుంది. కేవ‌లం యాక్ష‌న్ మోష‌న్ తో క‌థ న‌డిపించేస్తే ఆశించిన రిజ‌ల్ట్ అందక‌పోవ‌చ్చు.

అందుకు ఇటీవ‌ల చాలా ఎగ్జాంపుల్స్ క‌ళ్ల ముంద‌రే ఉన్నాయి.  ఓటీటీల వెల్లువ‌లో కావాల్సిన విందు వినోదం ప‌సందుగా పుష్క‌లంగా ఆడియెన్ కి మొబైల్ ఫోన్ల‌లోనే దొరుకుతోంది. అలాంట‌ప్పుడు థియేట‌ర్ల‌కు రావాలంటే ప్ర‌తిదీ కొత్త‌గా ఉండాలి. హ‌ద్దులు చెరిపేసిన ఇలాంటి వేళ .. పాన్ ఇండియా సినిమాల వెల్లువ‌లో ప్ర‌తిదీ సంథింగ్ సంథింగ్ అన్న టాక్ తెచ్చుకుంటేనే లాంగ్ ర‌న్ సాధ్య‌మ‌వుతుంద‌న్న‌ది మేక‌ర్స్ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. బాలీవుడ్ మారేందుకు సిద్ధ‌మైంది. కాబ‌ట్టి పున‌రుత్థానం సాధ్య‌ప‌డుతుంద‌ని ఆశిద్దాం.

టాలీవుడ్ ఇప్ప‌టికే గ్రిప్ సంపాదించింది. ఆధిప‌త్యం చెలాయిస్తోంది. దీనిని ఇక‌పైనా ఇలానే కొన‌సాగించాల‌ని కోరుకుందాం. టాలీవుడ్ లో అగ్ర హీరోలు అగ్ర ద‌ర్శ‌క‌ నిర్మాత‌ల ఆలోచ‌న‌ల్లో ఊహాతీత‌మైన ప‌రిణ‌తి క‌నిపిస్తోంది. ఇది పాన్ ఇండియా మార్కెట్లో మ‌న స‌త్తాని నిరూపించుకునేందుకు మ‌రింత‌గా దోహ‌దం చేస్తుంద‌నే ఆకాంక్షిస్తోంది తుపాకి.
Tags:    

Similar News