థియేటర్ లు ఓపెన్ లేని సమయంలో... థియేటర్ లకు జనాలు వచ్చే పరిస్థితి లేని సమయంలో సినిమా లను ఓటీటీ లో డైరెక్ట్ రిలీజ్ చేయడం ఓకే కానీ ఒక వైపు థియేటర్ లు ఓపెన్ అయ్యాయి... కరోనా భయం కూడా లేదు. ఇలాంటి సమయంలో డైరెక్ట్ ఓటీటీ అంటే సినిమా ఇండస్ట్రీని మరియు థియేటర్ వ్యవస్థను నాశనం చేయడమే అంటూ సినీ విశ్లేషకులు మరియు సినీ ప్రేమికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
సౌత్ లో డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అనేది దాదాపుగా లేదు అని చెప్పాలి.. కానీ హిందీ సినిమా లు మాత్రం ఇంకా ఓటీటీ నే ఆశ్రయిస్తున్నాయి. సరే చిన్న సినిమాలు అంటే ఏమో కానీ అక్షయ్ కుమార్ వంటి సూపర్ స్టార్ చేసిన సినిమాలు కూడా ఓటీటీ లో స్ట్రీమింగ్ అయ్యాయి... స్ట్రీమింగ్ అవ్వబోతున్నాయి. థియేట్రికల్ రిలీజ్ స్క్రిప్ చేసిన సినిమాల జాబితా చాలా పెద్దగా బాలీవుడ్ లో మారుతోంది.
పెద్ద హీరోల సినిమాలు.. లేడీ ఓరియంటెడ్ సినిమాలు ఇలా చాలా సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్దకు వెళ్లాలి అంటే భయపడి ఓటీటీ స్ట్రీమింగ్ కు వెళ్తున్నాయి. ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి. అందుకే డైరెక్ట్ ఓటీటీ ద్వారా విడుదల చేయడం వల్ల పెట్టిన పెట్టుబడి అయినా వస్తుందని మేకర్స్ భావిస్తున్నట్లుగా ఉన్నారు. ఇప్పుడు బాలీవుడ్ కు చెందిన మరో సినిమా కూడా డైరెక్ట్ ఓటీటీకి సిద్దం అయ్యింది.
తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి మరియు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రీనా కైఫ్ కలిసి నటించిన 'మెరీ క్రిస్మస్' ను 2023 ఆరంభంలో ఓటీటీ ద్వారా డైరెక్ట్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా పేర్కొన్నారు. ఈ సినిమా ను మొన్నటి వరకు థియేట్రికల్ రిలీజ్ అనుకున్నారట. కానీ పరిస్థితులు ఏమాత్రం బాగాలేవనే ఉద్దేశ్యంతో ఓటీటీ వైపు వెళ్లారని తెలుస్తోంది.
ప్రముఖ ఓటీటీ ఈ సినిమాకు భారీ మొత్తాన్ని ఆఫర్ చేయడంతో థియేట్రికల్ స్కిప్ చేయడం లో తప్పు లేదు అనే నిర్ణయానికి వచ్చారట. ప్రస్తుతం సినిమా షూటింగ్ ముగింపు దశకు వచ్చింది. అక్టోబర్ వరకు సినిమా షూటింగ్ ను ముగించబోతున్నట్లుగా యూనిట్ సభ్యులు పేర్కొన్నారు.
సినిమా ను వచ్చే ఏడాది ఆరంభంలో ఓటీటీ ద్వారా డైరెక్ట్ స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఈ సినిమాకు సూపర్ హిట్ చిత్రం అందాదున్ దర్శకుడు శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహిస్తున్నాడు. రమేష్ తౌరానీ మరియు సంజయ్ రౌత్రాయ్ లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.