సంక్రాంతి వార్ లాక్డ్..ఫైటింగ్ ఆ నాలుగింట మ‌ధ్యే

Update: 2023-01-05 04:19 GMT
సంక్రాంతి  సినిమాల రిలీజ్ ల‌కి కౌంట్ డౌన్ మొద‌లైన సంగ‌తి తెలిసిందే. పండుగకి ఇంకా వారం  రోజులే స‌మ‌యం ఉంది. దీంతో పెండింగ్ ప‌నులు వీలైనంత వేగంగా పూర్తి చేసి సిద్దంగా ఉండాల‌ని రిలీజ్ సినిమాల‌న్ని హ‌డావుడిగా క‌నిపిస్తున్నాయి. చివ‌రి నిమిష‌లో ఎలాంటి జాప్యం లేకుండా ప‌క్కాగా అనుకున్న తేదికి..టైమ్ కి తొలి షో ప‌డిపోవాల్సిందే.

ఆర‌కంగా టీమ్ అప్ప‌టికీ అన్నిర‌కాలుగా సిద్దంగా ఉండాలి. ఈ సంక్రాంతి దాదాపు నాలుగు సినిమాల మ‌ధ్య పోటీ ఉంది.  ప్ర‌ధానంగా రెండు సినిమాలైతే నువ్వా?  నేనా? అన్న రేంజ్ లో త‌న్నుకోవ‌డం  ప‌క్కా అని తెలుస్తుంది. ఇప్ప‌టికే మెగాస్టార్ చిరంజీవి  'వాల్తేరు వీర‌య్య‌'...న‌ట‌సింహ బాల‌కృష్ణ న‌టించిన 'వీర‌సింహారెడ్డి'...విజ‌య్ 'వార‌సుడు'...అజిత్ 'తెగింపు' పోటీలో ఉన్న సంగ‌తి తెలిసిందే.

వీర‌య్య జ‌న‌వ‌రి 13న‌..'వీర‌సింహారెడ్డి'  ఆముందు రోజు 12వ తేదిన రిలీజ్ అవుతున్నాయి. ఇక‌ విజ‌య్..అజిత్ సినిమాలైతే ఒకే రోజు జ‌న‌వ‌రి 11న పోటాపోటీగా రిలీజ్ అవుతున్నాయి.  టాలీవుడ్ లో బాల‌య్య‌...చిరంజీవి మ‌ధ్య  ప్ర‌ధాన పోటీ క‌నిపిస్తుండ‌గా..కోలీవుడ్లో అజిత్...విజ‌య్ మ‌ధ్య బిగ్ ఫైట్ ఉంటుంది.  ఇక్క‌డ హీరోలు కోలీవుడ్ కి పోటీ కాదు....కోలీవుడ్.. టాలీవుడ్ హీరోల‌కుపోటీ కాదు.

కానీ కొంత వ‌ర‌కూ అనువాద చిత్రాల ప్ర‌భావ‌మైతే  తెలుగులో క‌నిపిస్తుంది. పండ‌గ సీజ‌న్ కాబ‌ట్టి పండ‌గ రెండు..మూడు రోజులు సినిమా ఎలా ఉన్నా?  థియేట‌ర్లు  హౌస్ ఫుల్ అవుతుంటాయి. ఏసినిమాకి  హిట్ టాక్ బాగా వ‌స్తే ఆ సినిమాకి క‌న‌క వ‌ర్ష‌మే. వీటితో పాటు 'క‌ళ్యాణం క‌మ‌నీయం' అనే సినిమా జ‌న‌వ‌రి 14న రిలీజ్ అవుతుంది.

ఈ సినిమా కూడా పండ‌గ సీజ్ టార్గెట్ చేసింది. చిన్న సినిమాగా రిలీజ్ అవుతున్న కంటెంట్ ఉంటే? అదే పెద్ద సినిమా అవుతుంది. స్టార్ హీరోల్ని  సైతం కొట్టే సినిమాగా హైలైట్ అవుతుంది. కాబ‌ట్టి  ఇప్పుడే సినిమాని త‌క్కువ అంచ‌నా వేయ‌డానికి వీలు లేదు.

సైలెంట్ గా  రిలీజ్ అయి వంద‌ల కోట్లు తెచ్చిన  చిన్న సినిమాలెన్నో ఉన్నాయి. వాటి రిజ‌ల్ట్ చూసి బ‌డా హీరోలే విస్తుపోతున్నారు. ఆ ఎఫెక్ట్ కే స్టార్ హీరోలు కూడా  ప్రేక్ష‌కుల మ‌ధ్య‌లోకి రావ‌డం మొద‌లు పెట్టారు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News