తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు మంచి గుర్తింపు ఉన్న దర్శకులు ఇప్పుడు మాత్రం పూర్తిస్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నారు. ఇక జనాలను ఆకట్టుకోవాలి అంటే ఇప్పుడు పెద్ద టాస్క్ గా మారిపోయింది. ఒకప్పుడు సినిమాలో మినిమం కమర్షియల్ పాయింట్స్ ఉంటే ఎంతో కొంత బాక్సాఫీస్ వద్ద కలెక్ట్ చేసేవి. దాంతో దర్శకుల కెరీర్ కు పెద్దగా డొకా ఉండేది కాదు. కానీ ఇప్పుడు మాత్రం కాస్త తేడా వచ్చినా కూడా జనాలు థియేటర్లోకి రావడం లేదు. దీంతో నష్టాలు వస్తే ఒక రేంజ్ లో వస్తున్నాయి. ఆ ప్రభావం పూర్తిగా దర్శకులపై పడుతొంది.
ఇక ఒకప్పుడు సంతోషం, మిస్టర్ పర్ఫెక్ట్ వంటి సినిమాలతో మంచి ఫ్యామిలీ డైరెక్టర్ గా గుర్తింపు అందుకున్న దశరథ్ అసలు మీడియాలో కూడా ఎక్కడ కనిపించడం లేదు. అతను చివరగా 2016లో మంచు విష్ణుతో శౌర్య అనే సినిమా చేశాడు. ఆ సినిమా ఎలాంటి ఫలితం అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అసలు మిస్టర్ పర్ఫెక్ట్ తర్వాత అతని కెరీర్ మరొక రేంజ్ లో ఉంటుంది అని అనుకున్నారు.
ఇక నాగార్జున నమ్మకంతోనే సంతోషం కాంబినేషన్ రిపీట్ చేయాలని గ్రీకువీరుడు అనే సినిమా చేశాడు. ఆ సినిమా దెబ్బ కొట్టడంతో కెరీర్ ఒక్కసారిగా డౌన్ అయిపోయింది. ఇక తర్వాత మంచు మనోజ్ శౌర్య సినిమాతో అవకాశం ఇవ్వగా అది కూడా రివర్స్ అయ్యింది.
ఇక దశరథ్ కు మళ్ళీ అవకాశాలు రాలేదు. అతను ఆ తర్వాత రెండేళ్ళ పాటు దిల్ రాజు కాంపౌండ్ లోనే ఎక్కువగా కొనసాగుతూ వచ్చాడు. కానీ అక్కడ అతనికి కనీసం రైటర్ గా కూడా అవకాశం దొరికింది లేదు. కేవలం స్టోరీ సిట్టింగ్స్ లోనే ఎంతో కొంత పేమెంట్ తీసుకుంటూ వచ్చాడు.
ఇక దశరథ్ ఇటీవల కాలంలో మళ్ళీ గీతా ఆర్ట్స్ వైపు తిరిగినట్లు సమాచారం. ఆ కాంపౌండ్ లో ఇప్పటికే కొంతమంది రచయితలకు అలాగే ఫామ్ కోల్పోయిన దర్శకులకు మంచి అవకాశాలు దక్కుతున్నాయి. మంచి స్క్రిప్ట్ తో మెప్పిస్తే మాత్రం GA2 లో దర్శకుల బ్యాక్ గ్రౌండ్ తో సంబంధం లేకుండా అవకాశాలు కలిపిస్తోంది.
ఆ సంస్థ సపోర్ట్ తోనే పరుశురామ్ గీతగోవిందం సినిమాతో ఫామ్ లోకి వచ్చాడు. ఇక త్రివిక్రమ్ తో ఎప్పటినుంచో తెలుసు కాబట్టి సితార ఎంటర్టైన్మెంట్స్ లో కూడా కొన్ని స్టోరీ సిట్టింగ్స్ లో కూడా పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. అక్కడ కూడా మంచి కంటెంట్ ఇస్తే అవకాశం వచ్చే ఛాన్స్ ఉంటుంది. మరి దశరథ్ ఈ దారులను ఎంతవరకు యూజ్ చేసుకుంటాడో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.