మరాఠీ బ్యూటీ మృణాల్ ఠాకూర్ హనురాఘవపూడి దర్శకత్వం వహిస్తోన్న`సీతరామం` సినిమాతో టాలీవుడ్ కి పరిచయమవుతోన్న సంగతి తెలిసిందే. దుల్కార్ సల్మాన్ హీరోగా రూపొందుతోన్న చిత్రంలో మరో హీరోయిన్ గా రష్మిక మందన్న కూడా నటిస్తోంది. అయితే మెయిన్ లీడ్ సీత పాత్ర మాత్రం మృణాల్ దే.
ఈ నేపథ్యంలో రామ-సీతల మధ్య సన్నివేశాల ప్రాధాన్యత గురించి చెప్పాల్సిన పనిలేదు. హనురాఘవపూడి సినిమాల్లో హీరో పాత్రకన్నా..హీరోయిన్ పాత్రని చాలా బలంగా రాసుకుంటాడు. హీరోకి ధీటుగా హీరోయిన్ పాత్రని తనదైన శైలిలో మలచడం హను ప్రత్యేకత.
తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ అనంతరం మృణాల్ సినిమాకి సంబంధించిన ఆన్ సెట్స్ అనుభవాన్ని పంచకున్నారు. ఆవేంటో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం.
``హను సీత పాత్ర గురించి చెప్పినప్పుడే లవ్ లోపడిపోయాను. సీత పాత్రనే నన్ను వెతుక్కుంటూ వచ్చింది. చాలా రొమాంటిక్ రోల్ ఇది. ఇటీవలి కాలంలో రొమాంటిక్ సినిమాలు ఎక్కువగా రావడం లేదు. రొమాంటిక్ ఫీల్ ఉన్న సినిమా ఇది. మా రొమాన్స్ అందర్నీ ఆకట్టుకుంటుంది. భాష రాకపోవడంతో ఈ పాత్ర నేను చేయగలనా? లేదా? అని డౌట్ పడ్డా.
సినిమా వదిలేద్దాం అనుకున్నా. చాలా కష్టంగాను అనిపించింది. ఆసమయంలో దుల్కార్ మనోధైర్యాన్ని ఇచ్చారు. నీవు మా సీతవు. నువ్వు తప్ప ఇంకెవరూ ఈ పాత్ర చేయలేరని ధైర్యాన్ని నింపారు. ఆరకంగా నాప్రతిభను తెలుగు ద్వారా నిరూపించుకునే అవకాశం దక్కింది. ఇంత వరకూ అలాంటి చాన్స్ రాలేదని ఫీలయ్యేదాన్ని. ఇప్పుడా బాధ మనసు నుంచి తొలగిపోయింది.
కొన్ని సన్నివేశాలు మైనస్ 22 డిగ్రీల్లో షూట్ చేసాం. పిజీ..రష్యా..కశ్మీర్ ఇంకా చాలా ప్రాంతాల్లో షూటింగ్ జరిగింది. నేను బోర్డ్ ఎగ్జామ్ రాసినట్లు.. దుల్కార్ 10 వ తరగతి పరీక్షలు రాసినట్లు ఫీలయ్యాం. మరాఠీ తెలుగు భాషకి దగ్గరగా ఉంటుంది. ఆరంభంలో ఇబ్బంది పడినా తర్వాత సులువైంది. అలాగే `సూపర్ 30` మూవీ తర్వాత మళ్లీ కథక్ డాన్స్ చేయడం థ్రిల్ గా ఫీలయ్యా. బృందా మాస్టర్ స్టెప్పులు ఎగ్జైట్ మెంట్ ని ఇచ్చాయి` అని చెప్పుకొచ్చింది.