ఎన్టీఆర్ #30 లో సీత‌కి ఛాన్స్ అంత వీజీనా?

Update: 2022-08-11 05:18 GMT
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ క‌థానాయ‌కుడిగా న‌టించ‌నున్న 30వ చిత్రాన్ని కొర‌టాల శివ ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్న సంగ‌తి  తెలిసిందే. ఈసారి స్ర్కిప్ట్ పైనే ప‌క‌డ్భందీగానే  వ‌ర్క్ చేసారు. అందుకు త‌గ్గ‌ట్టు పాత్ర‌ల ఎంపికపైనా ప్ర‌త్యేకంగా దృష్టిసారించి ముందుకెళ్తున్నారు. ఈ నేప‌థ్యంలో సినిమా రేంజ్ ని అంత‌కంత‌కు పెంచాల‌ని బాలీవుడ్ న‌టి అలియాభ‌ట్ ని దించాల‌ని ఎంతో ప్ర‌యత్నించారు.

అలియా సైతం తొలుత ఆస‌క్తి చూపించింది. కానీ ఆ త‌ర్వాత బిజీ షెడ్యూల్ స‌హా ఇటీవ‌ల గ‌ర్భం కూడా దాల్చ‌డంతో ప్రాజెక్ట్ నుంచి అలియా త‌ప్పుకోవాల్సి వ‌చ్చింది. అప్ప‌టి నుంచి యంగ్ టైగ‌ర్ స‌ర‌స‌న న‌టించే హీరోయిన్ ఎవ‌రు? అన్న దానిపై ఆస‌క్తి సంత‌రించుకుంది. అలియా ఎగ్జిట్ త‌ర్వాత స‌మంత‌ని సంప్ర‌దించారు. కానీ సామ్ బాలీవుడ్ లో బిజీ అవ్వ‌డం స‌హా మాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వ‌డంతో ఆ రెండు ప‌రిశ్ర‌మ‌ల‌పైనే దృష్టి పెట్టింది.

అలా సమంత కూడా ప్రాజెక్ట్ ని రిజెక్ట్ చేసింది. ఇంకా జాన్వీ కపూర్..కృతిశెట్టి పేర్లు సైతం తెర‌పైకి వ‌చ్చాయి. అయితే ఆ సినిమా కోసం త‌మ‌నెవ‌రు? సంప్ర‌దించ‌లేద‌ని క్లారిటీ ఇచ్చారు. ఈ న‌పేప‌థ్యంలో తాజాగా మ‌రో కొత్త హీరోయిన్ పేరు తెర‌పైకి వ‌స్తోంది. `సీతారామం` చిత్రంతో టాలీవుల్ లో ఎంట్రీ ఇచ్చిన మృణాల్ ఠాకూర్ ని కొర‌టాల సంప్ర‌దించిన‌ట్లు ప్ర‌చారం సాగుతోంది.

సీత పాత్ర‌తో మెప్పించిన అమ్మ‌డి న‌ట‌న‌కు కొర‌టాల సైతం ఫిదా అయిన‌ట్లు..ఇదే విష‌యాన్ని ఆయ‌న ఎన్టీఆర్ దృష్టికి తీసుకెళ్లిన‌ట్లు వినిపిస్తుంది.  తార‌క్ కూడా సానుకూలంగా స్పందించ‌డంతో?  మృణాల్ లాక్ అయ్యే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. ఈ పాత్ర కోసం మృణాల్ కొటిన్న‌ర దాకా పారితోషికం డిమాండ్ చేసింద‌న్న‌ది మ‌రో ర‌క‌మైన ప్ర‌చారం.

మ‌రి ఇందులో వాస్త‌వాలు తెలియాలంటే?  మేక‌ర్స్ నోరు విప్పితే త‌ప్ప క్లారిటీ రాదు. అయితే మృణాల్ ఒక్క‌ర్నే కొర‌టాల హీరోయిన్ గా భావించ‌డం  లేదు. తారక్ త‌గ్గ స‌రిజోడీ కోసం చాలా మంది భామ‌ల్నే ప‌రిశీలిస్తున్న‌ట్లు చెప్పొచ్చు. అలియాభ‌ట్ లాంటి స్టార్ హీరోయిన్ గా అనుకున్న నేప‌థ్యంలో కొత్త  హీరోయిన్ కి అప్పుడే ఎన్టీఆర్  స‌ర‌స‌న ఛాన్స్ ఇస్తారా? అన్న సందేహం స‌హ‌జ‌మే.

ఎన్టీఆర్-కొర‌టాల కాంబినేష‌న్ అంటే ? అంచనాలు హై లో ఉంటాయి. స్టార్ హీరోయిన్ నే దించ‌డానికి ఆస్కారం ఉంటుంది. ఇప్ప‌టివ‌ర‌కూ కొర‌టాల చిత్రాల్లో హీరోయిన్లగా న‌టించిన వారంతా క్రేజీ భామ‌లే. భారీ స్టార్ డ‌మ్ గ‌ల నాయిక‌లే. అటు ఎన్టీఆర్ ఇమేజ్ రెట్టింపు అయింది. పాన్ ఇండియా స్టార్ గా ఖ్యాతికెక్కాడు. ఈ నేప‌థ్యంలో  న‌వ నాయిక ఎంపిక అన్న‌ది అంత వీజీ కాదన్న‌ది విశ్లేష‌కుల మాట‌.
Tags:    

Similar News