మెగా ప్రిన్స్ సరసన టాలెంటెడ్ బ్యూటీ

Update: 2019-04-01 08:01 GMT
గత ఏడాది డిసెంబర్ లో అంతరిక్షం షాక్ ఇచ్చినా ఆ వెంటనే నెల తిరక్కుండానే ఎఫ్2 రూపంలో మరో ఇండస్ట్రీ హిట్ సొంతం చేసుకున్న వరుణ్ తేజ్ ఇప్పుడు కమర్షియల్ మూవీస్ తో పాటు ప్రయోగాలకూ సై అంటున్నాడు. అందులో భాగంగా ఒప్పుకున్నదే వాల్మీకి. తమిళ్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన జిగర్ తండాను తెలుగులో హరీష్ శంకర్ దర్శకత్వంలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇందులో కాస్త నెగటివ్ షేడ్స్ ఉన్న కీలకమైన పాత్రను వరుణ్ తేజ్ చేస్తున్నాడు. ఇది హీరోకు ఏ మాత్రం తీసిపోని రీతిలో ఉంటుంది. ఒకరకంగా చెప్పాలంటే హీరోతో సమానంగా కొన్నిచోట్ల అంత కన్నా ఎక్కువ డామినేట్ చేసేలా ఉంటుంది. ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టుకున్న వాల్మీకిలో వరుణ్ తేజ్ సరసన మృణాళిని రవిని ఎంపిక చేసుకున్నట్టు సమాచారం

ఎవరీ మృణాళిని అనుకుంటున్నారా. ఇటీవలే విడుదలై సంచలన విజయం దిశగా దూసుకుపోతున్న సూపర్ డీలక్స్ లో తను చేసిన పాత్రకు మంచి పేరు వచ్చింది. సోషల్ మీడియాలో హాట్ సెలబ్రిటీ అయిన మృణాళిని రవి చాలా టాలెంటెడ్ యాక్ట్రెస్. ఒరిజినల్ లో లక్ష్మి రాయ్ చేసిన పాత్రకు తనను ఎంపిక చేశారు. టెస్ట్ షూట్ కూడా అయ్యిందట. వరుణ్ తేజ్ ఈ నెలలో నుంచి జాయిన్ అవుతాడు కాబట్టి అప్పటి నుంచి మృణాళిని కాంబో సీన్స్ కూడా తీస్తారు. ఇటీవలే విడుదలైన అంజలి సిబిఐలో రాశిఖన్నా లవర్ గా నటించిన అధర్వ మురళి ఇందులో మరో కీలక పాత్ర చేస్తున్నాడు. ఈ ఏడాదిలోనే విడుదల కానున్న వాల్మీకి రిలీజ్ డేట్ ఇంకా లాక్ కావాల్సి ఉంది
Tags:    

Similar News