టాలీవుడ్ సీనియర్ నిర్మాత ఎంఎస్ రాజు గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. సుమంత్ ఆర్ట్స్ బ్యానర్ లో ఇండస్ట్రీకి ఎన్నో సక్సెస్ ఫుల్ చిత్రాలు అందించారు.. ఎందరో హీరోలకు స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టే సినిమాలు నిర్మించారాయన. ఒకప్పుడు స్టార్ ప్రొడ్యూసర్ గా చెలామణి అయిన ఎమ్మెస్ రాజు.. 'మస్కా' తర్వాత సినిమాలకు దూరంగా ఉన్నారు.
అయితే ఇప్పుడు మెగా ఫోన్ పట్టుకొని తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. చాలా గ్యాప్ తర్వాత తనను తాను అప్డేట్ చేసుకుని వచ్చారు.గతంలో 'వాన' 'తూనీగ తూనీగ' వంటి చిత్రాలను డైరెక్ట్ చేసిన సంక్రాంతి రాజు.. 'డర్టీ హరి' సినిమాతో ప్రేక్షకులను అలరించారు.
ఇప్పుడు '7 డేస్ 6 నైట్స్' అనే యూత్ ఫుల్ రొమాంటిక్ చిత్రాన్ని రిలీజ్ కు రెడీ చేశారు.. 'సతి' అనే టైటిల్ తో మరో ఆసక్తికరమైన చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకొచ్చారు. స్టార్ హీరోలతో కమర్షియల్ చిత్రాలను తీసే ఇతర ఔట్ డేటెడ్ ఫిలిం మేకర్స్ మాదిరిగా కాకుండా.. ఎంఎస్ రాజు నేటి తరాన్ని టార్గెట్ చేస్తూ న్యూ ఏజ్ చిత్రాలను తీయడానికి ముందుకు వస్తున్నారు.
ఆకర్షణీయమైన స్క్రీన్ ప్లేతో యువతను ఆకట్టుకునే ఫ్రెష్ కంటెంట్ తో మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు ఎంఎస్ రాజు. ఈ నేపథ్యంలో ఆయన తెరకెక్కించిన '7 డేస్ 6 నైట్స్' సినిమా జూన్ 24న విడుదల కాబోతోంది. ఇందులో ఎమ్మెస్ రాజు తనయుడు సుమంత్ అశ్విన్ మరియు రోహన్ హీరోలుగా నటించగా.. మెహర్ చావల్ - కృతికా శెట్టి హీరోయిన్లుగా కనిపించనున్నారు.
సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్ సమర్పణలో వైల్డ్ హనీ ప్రొడక్షన్స్ బ్యానర్ లో సుమంత్ అశ్విన్ - ఎస్. రజనీకాంత్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. '7 డేస్ 6 నైట్స్' రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న తరుణంలో మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఎంఎస్ రాజు లేటెస్టుగా ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.
ప్యాషన్ లేకుండా ఇండస్ట్రీలో మనుగడ సాగించడం అసాధ్యమని.. తన వరకు ప్రస్తుతం డైరెక్షన్ చేస్తూ హ్యాపీగా ఉన్నానని ఎంఎస్ రాజు తెలిపారు. తన కెరీర్ లో 'పౌర్ణమి' 'వాన' సినిమాలు నిరాశ పరిచాయని.. వాటి వల్ల బాగా నష్టపోయామనన్నారు. తన సినిమాలతో నష్టపోయిన బయ్యర్లను ఆస్తులమ్మి ఆదుకున్నానని చెప్పారు.
తాను స్టార్ హీరోలను క్రేజీ కాంబినేషన్లను ఎప్పుడూ నమ్మనని.. కథని మాత్రమే నమ్ముతానని.. ఇకపై కూడా అలానే ఉంటానని అన్నారు. తాను స్టార్ హీరోలు డైరెక్టర్ల వైపు వెళ్లనని చెప్పుకొచ్చారు. అప్పట్లో మహేష్ బాబు - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో సినిమాని నిర్మించని అడిగితే.. తాను చేయలేదని తెలిపారు ఎమ్మెస్ రాజు. 'రుద్రమదేవి' ప్రాజెక్ట్ మొదట తన వద్దకే వచ్చిందని చెప్పారు.
సుమంత్ ఆర్ట్స్ బ్యానర్ లో రవితేజతో సినిమా చేయమని అడిగితే.. తాను చేయలేదని వెల్లడించారు. ఒకవేళ ఇప్పుడు మహేశ్ బాబు - ప్రభాస్ వచ్చి మరోసారి తమతో సినిమాలు చేయాలని కోరినా.. తాను తీయనని ఎంఎస్ రాజు అన్నారు. తనకు నచ్చినట్టుగా సినిమా చేయడమంటేనే ఇష్టమని.. అందుకే అలాంటి భారీ ప్రాజెక్ట్స్ జోలికి వెళ్లబోనని స్పష్టం చేశారు.
డైరెక్టర్ గా ఇండస్ట్రీలో ఎవరూ టచ్ చేయని జానర్ చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తానని ఎంఎస్ రాజు అన్నారు. '7 డేస్ 6 నైట్స్' మూవీ మేకింగ్ ను పూర్తిగా ఆస్వాదించానని.. యువతీయువకులను కచ్చితంగా అలరిస్తుందని.. ఆ నమ్మకంతోనే ఐదు నెలలకు పైగా వేచి చూసి థియేటర్లలో విడుదల చేస్తున్నామని సీనియర్ దర్శక నిర్మాత చెప్పుకొచ్చారు.