'మాటే మంత్రము .. మనసే బంధము' అనే ఇళయరాజా స్వరకల్పనలోని పాట వినిపించిన్నప్పుడు, విశాలమైన కళ్లతో విన్యాసాలు చేసిన ముచ్చర్ల అరుణ రూపం కళ్లముందు కదలాడుతుంది. ఆ పాటలో ఓ చెరువులో ఆమె చుట్టూ కలువపూలు తిరుగుతూ ఉంటాయి. ఆ కలువ పూలను చూడాలా? ఆమె కళ్లను చూడాలా? అని తేల్చుకునేలోగానే ఆ పాట అయిపోతుంది. అలా తన ఆకర్షణీయమైన కళ్లతోనే అనేక అవకాశాలను దక్కించుకుంటూ ముందుకు వెళ్లిన నటిగా ముచ్చర్ల అరుణ కనిపిస్తారు.
పదేళ్ల పాటు సాగిన తన కెరియర్లో తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ భాషల్లో ఆమె 70 సినిమాల వరకూ చేశారు. 80వ దశకంలో దక్షణాది భాషలన్నింటిలోను నటిస్తూ ముచ్చర్ల అరుణ బిజీ అయ్యారు. కెరియర్ తొలినాళ్లలో హీరోయిన్ గా నటించిన ఆమె, ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోయారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆమె ఎన్నో ముఖ్యమైన .. కీలకమైన పాత్రలను పోషించారు. తెలుగులో 'సీతాకోకచిలుక' .. ' జేగంటలు' .. 'శ్రీవారికి ప్రేమలేఖ' .. 'శ్రుతిలయలు' .. 'స్వర్ణకమలం' .. 'శ్రీమతి ఒక బహుమతి' .. 'సంసారం ఒక చరంగం' వంటి సినిమాలు ఆమెకి మంచి పేరును తెచ్చిపెట్టాయి.
ముచ్చర్ల అరుణ ఏ పాత్రను చేసినా ఆమె పాత్ర తప్ప ఆమె కనిపించేవారు కాదు .. అదే ఆమె ప్రత్యేకత. కళ్లతోనే అద్భుతమైన హావభావాలను పలికిస్తూ మనసులను కట్టిపడేసేవారు. అందువలన ఆ సమయంలో వచ్చిన అన్ని సినిమాల్లో దాదాపుగా ఆమె కనిపించేవారు. కెరియర్ మంచి స్పీడ్ గా సాగుతున్నప్పుడే ఆమె పెళ్లి ఆలోచన చేశారు. మోహన్ గుప్తా అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకున్న ఆమె, ఆ తరువాత సినిమాలకి దూరంగా ఉన్నారు. అమెరికాలో సెటిల్ అయిన ఈ దంపతులకు నలుగురు అమ్మాయిలు.
చాలాకాలం పాటు ముచ్చర్ల అరుణ ఏమైపోయరనే విషయం ఎవరికీ తెలియదు. అలా అని చెప్పేసి ఆమెను ప్రేక్షకులు మరిచిపోలేదు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తరువాత నిన్నటి తరం తారలు ఈ ఫ్లాట్ ఫామ్ పై తారసపడుతూనే ఉన్నారు. అభిమానులను ఆనందపరుస్తూనే ఉన్నారు.
అలా ముచ్చర్ల అరుణ కూడా అభిమానులకు అందుబాటులోకి వచ్చారు. రీసెంట్ గా ఇన్ స్టాలోకి అడుగుపెట్టిన ఆమె, వంటలు .. హెల్త్ కి సంబంధించిన అంశాలను పంచుకుంటున్నారు. అప్పుడే ఆమె ఫాలోవర్స్ సంఖ్య ఒక లక్షా అరవై తొమ్మిది వేలకి చేరిపోయింది. తమ అభిమాన నటి ఇలా టచ్ లోకి వచ్చినందుకు అంతా కూడా హ్యాపీగా ఫీలవుతున్నారు.