అంబానీల అన్నదానం కూడా స్పెషలే..

Update: 2018-12-08 08:37 GMT
  అంబానీ ఇంటా పెళ్లి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఉదయ్ పూర్(రాజస్థాన్)లో ముఖేష్ అంభానీ ఏకైక కూతురు ఈషా అంబానీ పెళ్లి వేడుకలు శుక్రవారం  నుంచి మొదలయ్యాయి. ఉదయ్ పూర్ వాసుల ఆశ్వీర్వాదం తీసుకునేందుకు అంబానీ కుటుంబం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది. దీనిలో భాగంగా డిసెంబర్ 7 నుంచి 10 వరకు నిత్యాన్నదానం చేస్తున్నారు.

నాలుగు రోజులపాటు మూడుపూటల అన్నదానం కార్యక్రమం చేయడంతోపాటు భారతీయ వస్తు కళలను ప్రమోట్ చేసేలా స్వదేశీ బజారు పేరుతో ఒక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఇందులో దేశీయ కళా ఉత్పత్తులను ప్రదర్శిస్తారు. దీని వల్ల స్వదేశీ వ్యాపారాలకు లాభం చేకూరుతుంది. ఈ ఎగ్జిబిషన్ కు సీనీ - రాజకీయ ప్రముఖులు - అంతర్జాతీయ ప్రముఖులు తరలి రానున్నారు.

కాగా శుక్రవారం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో 5,100మందికి అంబానీ కుటుంబ సభ్యులు ఆహార పదార్థాలను వడ్డించారు. వీరిలో దివ్యాంగులు ఎక్కువగా ఉన్నారు. అన్నదానంలో పాల్గొన్నవారికి ముఖేష్-నీతా అంబానీ దంపతులు - అజయ్ - స్వాతి పిరమాల్ - ఇషా - ఆనంద్ లు పాల్గొని కొసరికొసరి వడ్డించారు.

కాగా డిసెంబర్ 8 -9 తేదిల్లో ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరుగనున్నాయి. డిసెంబర్ 12న వివాహాం అంగరంగ వైభవంగా జరుగున్న విషయం తెలిసిందే. ఏదిఏమైనా అంబానీ కుటుంబం అన్నదానం లాంటి సేవ కార్యక్రమాలు చేపట్టడ్డాన్ని అభినందించాల్సిందే.
   

Tags:    

Similar News