ద‌క్షిణాదిన కొత్త‌గా 1000 మ‌ల్టీప్లెక్స్ స్క్రీన్ల‌కు రంగం సిద్ధం!

Update: 2021-01-27 01:30 GMT
దక్షిణ భారతదేశంలో వ‌డివ‌డిగా విస్తరించడానికి ప‌లు మల్టీప్లెక్స్ చెయిన్స్ ప్ర‌ణాళిక‌ల్ని సిద్ధం చేస్తున్నాయి. సింగిల్ స్క్రీన్ ‌ల ఆధిపత్యం చెలామ‌ణిలో ఉన్న‌ దక్షిణాన మల్టీప్లెక్స్ చెయిన్ వ్య‌వ‌స్థ‌ వృద్ధి అవకాశం పుష్క‌లంగా క‌నిపిస్తోంద‌నేది ఓ స‌ర్వే. ద‌క్షిణాది రాష్ట్రాల్లో ఈ రంగంలో భారీగా పెట్టుబడులను ప్రోత్స‌హంచేవీలుంద‌ని లెక్క‌లు తేల్చారు.

ప్ర‌స్తుత మ‌హ‌మ్మారీ క్రైసిస్ తో మార్కెట్-విపరీతమైన సంక్షోభంలో ఉన్నప్పటికీ వినోద‌రంగం తిరిగి కార్యకలాపాలను ప్రారంభించడానికి సిద్ధ‌మ‌వ్వ‌డం అవ‌కాశాల్ని మెరుగుప‌రుస్తోంది. క్రైసిస్ అనంత‌రం భారీ సంఖ్యలో ప్రేక్షకులు తిరిగి థియేట‌ర్ల‌కు వ‌చ్చేందుకు వెన‌కాడ‌క‌పోవ‌డం హోప్ పెంచింది.

రాబోయే ఐదేళ్ళలో దక్షిణాన సుమారు 1000 కొత్త మల్టీప్లెక్సులు రావచ్చన్న అంనా ఉంది. ఐదు కొత్త మల్టీప్లెక్స్ చెయిన్ కంపెనీలు ఐదు రాష్ట్రాల్లో దాదాపు 60% వాటాను కలిగి ఉన్నాయని వాణిజ్య నిపుణులు తెలిపారు. చెన్నై- హైదరాబాద్- బెంగళూరుతో పాటు తుమ్కూర్- వైజాగ్- విజయవాడ- గుల్బర్గా - బెల్గాం వంటి చిన్న మార్కెట్లలోకి సినిమా చెయిన్ వ్య‌వ‌స్థ‌లు చొచ్చుకుపోవాలని చూస్తున్నాయి. కొన్ని సంస్థ‌లు ఇప్పటికే ఉన్న సింగిల్ స్క్రీన్‌లను స్వాధీనం చేసుకోవడానికి సిద్ధ‌మ‌వుతున్నాయ‌ని తెలుస్తోంది.

సినిమాలపై అసమానమైన అభిరుచి కలిగి ఉన్న‌ దక్షిణ భారతీయ ప్రేక్షకుల పాత్ర.. ఆ భాషలలో తయారైన కంటెంట్ భారతీయ సినిమా పరిశ్రమ ఎదుగుద‌ల‌కు సాయ‌ప‌డేందుకు దోహ‌ద ప‌డుతోంది. విస్తార‌మైన‌ అభిరుచి .. కంటెంట్ సృష్టి.. పరిపూర్ణ నాణ్యత.. సినిమా ఎగ్జిబిషన్ వ్యాపార దృక్పథం గొప్ప అవ‌కాశాల్ని సృష్టిస్తున్నాయ‌ని  ఐనాక్స్ లీజర్ లిమిటెడ్  చీఫ్ బిజినెస్ డెవలప్ మెంట్ ఆఫీసర్ శిరీష్ హండా అన్నారు. ఐనాక్స్ భారతదేశంలో తెరిచే ప్రతి మూడవ స్క్రీన్ ద‌క్షిణాదిలోనే ఉంటాయ‌ని తెలిపారు. వచ్చే 18 నెలలు దక్షిణ భారతదేశంలో విస్త‌రించే ప్లాన్ లో ఉన్నామ‌న్నారు.

దక్షిణ భారత మార్కెట్ చలనచిత్ర వీక్షణకు సామాజికంగా ఎక్కువ మొగ్గు చూపుతుంది. దీని ఫలితంగా దక్షిణాదిలో ప్రాంతీయ చలనచిత్రాలు గణనీయంగా విడుదల కావడం వలన అధిక ఆక్యుపెన్సీ స్థాయిలతో పాటు.. ప‌దే ప‌దే థియేట‌ర్ల‌కు వ‌చ్చే వాళ్ల సంఖ్య పెరిగే వీలుంటుంది. ఒక సినిమా బహుభాషా కంటెంట్ తో విడుద‌ల‌వ్వ‌డం అనేది దేశంలోని ఏ ఇతర ప్రాంతాలకన్నా ద‌క్షిణాదిన‌ ఎక్కువ " అని పివిఆర్ సినిమాస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గౌతమ్ దత్తా అన్నారు.

దక్షిణాదిన‌ సినిమాల‌కు వెళ్ళేవారు తెలుగు-త‌మిళం-క‌న్న‌డ‌ మలయాళం చిత్రాల కోసం థియేటర్లలోకి రావడమే కాకుండా.. ఇంగ్లీష్ .. హిందీ సినిమాలను చూసే ప్రవృత్తిని క‌లిగి ఉన్నారు.  చాలా మంది దక్షిణ భారత తారలు తమ అభిమానులకు డెమిగాడ్స్ లాగా ఉంటారు. వారు నటించిన సినిమాలు భారీగా జనాన్ని ఆకర్షిస్తాయి. ఎందుకంటే వారు మాస్.. క్లాస్ తో కనెక్ట్ అవ్వగలరు అని దత్తా అన్నారు. పివిఆర్ బెంగళూరు- మైసూర్ - చెన్నై- హైదరాబాద్ - కోయంబత్తూర్ - వైజాగ్ లలో థియేటర్లను తెరవాలని చూస్తోంది.

సినీపోలిస్ ఇండియా డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దేవాంగ్ సంపత్ మాట్లాడుతూ.. ఐదు ద‌క్షిణాది రాష్ట్రాలు సంవత్సరానికి ప్రతి స్క్రీన్ కు సగటున 200000 మంది వీక్షకులను కలిగి ఉన్నాయి. కంటెంట్ నాణ్యతను పరిశీలిస్తే ఇది ఆశ్చర్యం కలిగించదు. ప్రతి స్క్రిప్ట్  విజువల్ అప్పీల్ వెనుక ఉన్న బలమైన ఎమోషనల్ పిచ్ జ‌నాల్ని ర‌ప్పిస్తోంది. ఇది బాహుబలి ఫ్రాంచైజ్ వంటి బ్లాక్ బస్టర్లలో కనిపిస్తుంది అని విశ్లేష‌కులు సంపత్ చెప్పారు.

ఖచ్చితంగా చెప్పాలంటే ఉత్తర భారతదేశ ఆడియెన్ తో పోల్చితే దక్షిణ భారతదేశం సాంప్రదాయకంగా సింగిల్ స్క్రీన్ ‌ల ఆధిపత్యాన్ని కలిగి ఉంది. ఈ పరిశ్రమ క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌ను క్రమం తప్పకుండా విడుదల చేస్తుంది. కానీ ఇప్పుడు మల్టీప్లెక్సులు ఊపందుకుంటున్నాయి. ``గత ఐదేళ్ళు మల్టీప్లెక్స్ మార్కెట్లో వేగంగా వృద్ధిని సాధించాయి. ఈ ధోరణి ఇక‌పైనా కొనసాగుతుంది. జ‌నం దృష్టి జాతీయం నుండి ప్రాంతీయ మార్కెట్లకు మారిపోయింది`` అని పివిఆర్  దత్తా చెప్పారు. వినోదం .. చలనచిత్రాలు ఒకే గమ్యస్థానంలో ఉన్నాయి. మాల్స్ ఈ స్వాభావిక అవసరాన్ని తీర్చగా.. మల్టీప్లెక్స్ కస్టమర్ ఎంచుకోవడానికి విస్తృత శ్రేణి ప్రదర్శన సమయాలను క‌లిగి.. విస్త్ర‌త‌ కంటెంట్‌ను అందిస్తుంది" అని దత్తా తెలిపారు.

అయితే ఇంకా కొన్ని సవాళ్లు అలానే ఉన్నాయి. ప్రధాన దక్షిణ భారత నగరాల్లో మాత్రమే మాల్స్ తెరుస్తున్నారు... టైర్-2 .. టైర్-3 పట్టణాలను విస్మరించి.. తద్వారా మల్టీప్లెక్స్ వ్యాపారం వృద్ధిని పరిమితం చేస్తున్నార‌ని దత్తా చెప్పారు.

దక్షిణ భారతదేశంతో సమస్య ఏమిటంటే.. ఐదు రాష్ట్రాలు మొత్తం బాక్సాఫీస్ వద్ద 40 శాతం కంటే ఎక్కువ వ‌సూళ్ల‌కు దోహదం చేస్తాయి. బెంగళూరు- హైదరాబాద్ - చెన్నై కాకుండా చాలా భూభాగాలు మల్టీప్లెక్స్ లు అందుబాటులో ఉండ‌వు... అని మీరాజ్ సినిమాస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అమిత్ శర్మ అన్నారు. మల్టీప్లెక్స్ లు రూ. 150-190 ధ‌ర ఉండ‌డం దీనికి కార‌ణ‌మ‌ని శర్మ అన్నారు. థియేటర్లు పరిచయం చేయగలిగే సాంకేతిక పరిజ్ఞానాలను లేదా విలాసవంతమైన అనుభవాలను ఇది పరిమితం చేస్తుంది.

అక్టోబర్ 15 న థియేటర్లను తిరిగి తెరవడానికి అనుమతించినందున మీరాజ్ రాయ్‌చూర్ .. హైదరాబాద్ .. కోయంబత్తూర్ ‌లలో థియేట‌ర్ల‌ను ప్రారంభించారు. హైదరాబాద్ - చెన్నై - బెంగళూరులలో కొత్త స్క్రీన్ ‌లను విస్త‌రించాల‌ని చూస్తున్నారు.

అంతేకాకుండా.. స్థానిక వినోద పన్ను (ఎల్‌బిఇటి) ను కూడా తమిళనాడు విధిస్తుంది. ఇది కొంత ఇబ్బందిక‌రం. ``లేజర్ టెక్నాలజీ లేదా అట్మోస్ ధ్వనిలో పెట్టుబడి పెట్టినప్పటి నుండి మూలధన వ్యయం ఎక్కువగా ఉంటుంది. వారి బలమైన చలన చిత్ర వీక్షణ సంస్కృతిని బట్టి ఇది ఫుట్ ఫాల్స్ ఎక్కువగా ఉన్నప్పటికీ ROI (పెట్టుబడిపై రాబడి) దృక్పథం నుండి ఆలోచిస్తే క‌ష్టం అవుతోంది`` అని శర్మ అన్నారు. మొత్తానికి ప‌లు మ‌ల్టీప్లెక్స్ చెయిన్ వ్య‌వ‌స్థ‌లు ద‌క్షిణాది రాష్ట్రాల‌పై పాగా వేయాల‌ని బ‌ల‌మైన ప్లాన్ తో ఉన్న‌ట్టు అర్థ‌మ‌వుతోంది.   
Tags:    

Similar News