సినిమా సెలబ్రెటీల మీద గాసిప్ న్యూస్ రాసే వాళ్లను మాత్రం తానెప్పుడూ క్షమించనని అంటోంది ముమైత్ ఖాన్. అలాంటి వార్తలు రాసే వాళ్లను చూస్తే తనకు విపరీతమైన కోపం వచ్చేస్తుందని ఒకప్పుడు టాలీవుడ్ ను ఏలిన ఈ ఐటెం భామ వ్యాఖ్యానించింది.
‘‘నాకు మీడియా వాళ్లతో మంచి సంబంధాలున్నాయి. ఎలక్ట్రానిక్ - ప్రింట్ మీడియా వాళ్లతో నాకు సమస్యలు లేవు. వాళ్లు గాసిప్ న్యూస్ రాయరు - ప్రసారం చేయరు. కానీ సోషల్ మీడియా - వెబ్ మీడియా - బ్లాగర్స్ మాత్రం దారుణమైన రాతలు రాస్తారు. వాళ్లను ఎప్పటికీ క్షమించను. ఐతే ఇలాంటి వార్తలు రాస్తేనే వాళ్లకు డబ్బులొస్తాయి. ఫుడ్డు దొరుకుతుంది. అందుకే బతుక్కోనీలే అని పట్టించుకోకుండా వదిలేస్తున్నా’’ అని ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో ముమైత్ వ్యాఖ్యానించింది.
ఒకప్పట్లా తనకు సినిమాల్లో ప్రస్తుతం అవకాశాలు లేనప్పటికీ తన లైఫ్ చాలా సంతోషంగానే సాగిపోతోందని.. ఇన్నేళ్ల కెరీర్లో తాను సాధించిన దాని పట్ల చాలా సంతోషంగా ఉన్నానని ముమైత్ చెప్పింది. చాన్నాళ్ల తర్వాత ‘డిక్టేటర్’ సినిమాలో ఐటెం సాంగ్ తో తెలుగులోకి తిరిగి రావడం సంతోషంగా ఉందని.. ఇందులో తన డ్యాన్స్ చూశాక మరిన్ని అవకాశాలు దక్కుతాయని ఆశిస్తున్నానని ముమైత్ తెలిపింది.